Ads
ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అంత ఈజీ కాదు. ఎంతో కష్ట పడితే కానీ ఇండస్ట్రీ లో నిలవలేము. అయితే చాలా మంది నటులు ఎంతో కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చారు కొంతమంది హీరోలుగా స్థిర పడాలని అనుకుంటే కొంత మంది కమెడియన్లుగా… కొంత మంది విలన్లుగా ఇండస్ట్రీ లో స్థిరపడాలని కోరుకుంటూ జీవితంలో సక్సెస్ పొందాలని భావిస్తారు.
దాని కోసం ఎంతగానో కృషి చేస్తారు. అయితే ఇండస్ట్రీ లో సక్సెస్ అవ్వాలంటే టాలెంట్ ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి.
నిజానికి సినిమాలో హీరోలకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత విలన్స్ కి కూడా వుంది. తెలుగు సినిమాలో విలన్ ది కూడా ప్రధాన పాత్ర అని చెప్పొచ్చు. చాలామంది నటులు మంచి విలన్లుగా పేరు పొందారు. ప్రకాష్ రాజ్ మొదలు సోను సూద్ దాకా చాలా మంది విలన్స్ ఉన్నారు. మరి తెలుగు సినిమాలలో ఎక్కువగా కనబడే ఈ విలన్స్ రెమ్యూనరేషన్ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.
#1. ఆది పినిశెట్టి:
ఆది మనకి చాలా సినిమాల్లో విలన్ గా కనపడుతూ ఉంటాడు. ఆది పినిశెట్టి ఒక్కో సినిమాకు కోటి కి పైగానే తీసుకుంటాడు.
Ads
#2. ప్రకాష్ రాజ్:
ప్రకాష్ రాజ్ ఎంతో గొప్ప నటుడు. చాలా సినిమాల్లో విలన్ గా చేసారు ప్రకాష్ రాజ్. తండ్రి పాత్రలని కూడా చేస్తూ వుంటారు. ఒక్క రోజుకు 10 లక్షల వరకు తీసుకుంటారు ప్రకాష్ రాజ్.
#3. శ్రీకాంత్:
హీరో శ్రీకాంత్ బాలయ్య అఖండ సినిమాలో విలన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కోటికి పైగానే శ్రీకాంత్ తీసుకున్నారట.
#4. సాయికుమార్:
డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా సాయి కుమార్ బాగా పాపులర్ అయ్యారు. సినిమాకు 50 లక్షలు సాయికుమార్ తీసుకుంటారు.
#5. సుదీప్:
ఒక్కో సినిమాకు సుదీప్ మూడు కోట్లకు పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటాడు.
#6. సోను సూద్:
ఇక సోను సూద్ అయితే ఇప్పుడు ఒక్కో సినిమా కి మూడు కోట్ల వరకు తీసుకుంటున్నాడు.