Ads
హీరో హీరోయిన్లకు సిని పరిశ్రమలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అలాగే హాస్యనటినటులకు కూడా అలాంటి ప్రాధాన్యతే ఉంటుంది. దానివల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది కమెడియన్స్ ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నారు.
Ads
అలా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నవారిలో లేడీ కమెడియన్ కోవై సరళ ఒకరు. వెండితెర పై కామెడీ పండించాలంటే కోవై సరళ తరువాతనే ఎవరైనా అని చెప్పవచ్చు. ఎంతటి బాధలో ఉన్న వారైనా ఆమె నటించిన మూవీస్ ని చూస్తే చిరునవ్వును చిందిస్తారు. తన అద్భుతమైన నటనతో, కామెడీ టైమింగ్ తో కోవై సరళ లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె ఇప్పటికీ సినిమాలలో నటిస్తున్నారు.
ఇక తెలుగు సినిమాల్లో కోవై సరళ, బ్రహ్మానందం కలయికలో వచ్చిన చిత్రాలలో వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. కామెడీ పండించడంలో మహామహులు అయిన వీరిద్దరు నటించిన సన్నివేశాలను ఇప్పటికి యూట్యూబ్ లో చూసేవారు చాలామందే ఉన్నారు. కోవై సరళ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషలలో కలిపి దాదాపుగా ఏడు వందలకు పైగా చిత్రాలలో నటించి, ఆడియెన్స్ ని నవ్వించిన ఆమె వృత్తిపరంగా సక్సెస్ అయ్యారు.
అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో సక్సెస్ కాలేకపోయారు. తన ఫ్యామిలీ పరిస్థితుల వల్ల, కుటుంబ భారాన్ని మొత్తం తానే చూసుకోవాల్సి రావడంతో ఆమె తన గురించి ఆలోచించలేకపోయారు. ఇంట్లో కోవే సరళ పెద్దది అవడంతో తొడబుట్టిన వారి బాధ్యతలను ఆమె తీసుకుంది. అలా వారిని చదివించి, చివరికి వల్లకి మంచి లైఫ్ ని ఏర్పరిచింది. వాళ్ళంతా ప్రస్తుతం వేరే దేశాలలో ఉంటున్నారు. బాధ్యతల వల్ల కోవై సరళ పెళ్లి కూడా చేసుకోకుండా కుటుంబాన్ని చూసుకుంది.
వాళ్ళను చూసుకోవడం కోసమే సినిమాల్లో నటించారు. కటుంబం కోసం ఆమె బ్రతికింది. ప్రస్తుతం కోవై సరళకు వయసు పైబడింది. దాంతో అవకాశాలు తగ్గాయి. ఇప్పుడు తనని పట్టించుకునే వారే లేరు. ఎవరి కోసం అయితే ఆమె తన జీవితాన్ని అర్పించిందో ఇప్పుడు వాళ్లు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తెరపై అందరిని నవ్వించిన కోవే సరళ జీవితం తెర వెనుక విషాదంతో కూడుకున్నది.
Also Read: సూపర్ స్టార్ రజినీకాంత్ వదులుకున్న తెలుగు సినిమా ఏమిటో తెలుసా?