Ads
తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో కొత్త సినిమా మొదలైంది.ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ ని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గా మార్చి పూజా కార్యక్రమాలు జరిపించారు.
Ads
ఈ సినిమా మైత్రి మూవీస్ కార్యాలయంలో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమా లాంచ్ కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, వివి వినాయక్, బుచ్చిబాబు కూడా అతిథులుగా వచ్చారు. డైరెక్టర్స్ అతిథులుగా పవన్ కళ్యాణ్ సినిమా లాంచ్ చాలా ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి పవన్ స్నేహితుడైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హాజరు అవలేదు.ఇక ఈ విషయం కాస్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి డైరెక్టర్ త్రివిక్రమ్ మిస్ అవ్వడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇక దీనిపై తెర వెనుక కూడా చాలా వార్తలు వినిపిస్తునట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ పవన్ చిత్రాల విషయంలో ఎంతగా ఇన్వాల్వ్ అవుతారో అందరికి తెలిసిందే. మరి అలాంటి త్రివిక్రమ్ ఈ సినిమా లంచ్ కి ఎందుకు రాలేదన్నదే ప్రస్తుతం చర్చకి దారి తీసింది. దీనితో త్రివిక్రమ్, డైరెక్టర్ హరీష్ శంకర్ మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జోరుగా జరుగుతోంది.ఎందుకంటే హరీష్ శంకర్ చాలా రోజుల క్రితమే భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్ చేసాడు. ప్లానింగ్ అంతా త్రివిక్రమ్ చేస్తూ ఉండడంతో పవన్ హరీష్ సినిమాని పక్కన పెట్టి, భీమ్లా నాయక్ సినిమా పూర్తి చేశారు. ఇక భవదీయుడు లేట్ కి త్రివిక్రమ్ పరోక్షంగా కారణం అని,అదే వారిద్దరి మధ్య విభేదాలకు దారితీసిందని వినిపిస్తోంది. ఇదే సమయాయంలో మరో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ భవదీయుడు స్ట్రైట్ సినిమాగా తీయవద్దని, హరీష్ శంకర్ తో తేరి సినిమాని రీమేక్ చేయమని పవన్ కి సలహా ఇచ్చినట్లుగా రూమర్లు వస్తున్నాయి. అందువల్లే పవన్ కళ్యాణ్ భవదీయుడు సినిమాని ముందుకు తీసుకువెళ్ళలేదని, పవన్ వకీల్ సాబ్ సినిమాని చేసినా, సుజీత్ సినిమాని ప్రకటించినా, అన్నింటి వెనుక త్రివిక్రమ్ ఉన్నాడనే ప్రచారం కూడా ఉంది. ఇక త్రివిక్రమ్ వల్ల భవదీయుడు స్క్రిప్ట్ మార్చాల్సి రావడం, సినిమా ఆలస్యం కావడం వల్ల హరీష్ ఆగ్రహంతో ఉన్నడని, అందుకనే త్రివిక్రమ్ లాంచ్ కి రాలేదని టాక్ నడుస్తోంది.
Also Read: ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన 10 డబ్బింగ్ సినిమాలు ఏమిటో తెలుసా?