శ్రీలీల విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది.? తప్పేముందని అలా అంటున్నారు.?

Ads

టాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి, చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ ఎదిగి, పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో తెలుగులో ఎంట్రీ  ఇచ్చిన శ్రీలీల, ఈ మూవీ కమర్షియల్ గా హిట్ కాలేకపోయినా అందం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో వరుస ఆఫర్స్ అందుకున్నారు.

Ads

చేతినిండా సినిమాలతో బిజీ హీరోయిన్ గా పేరు తెచ్చకుంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అయితే శ్రీలీల నటించిన సినిమాలు ఇటీవల ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దాంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ధ‌మాకా మూవీలో  శ్రీలీల‌ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో ఆమె డ్యాన్సు, అందం ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ఈ మూవీ వంద కోట్ల‌కుపైగా వసూళ్లు సాధించి, బల్క్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ హిట్ తో శ్రీలీల‌ మేకర్స్ ల‌క్కీ ఛార్మ్‌ అయ్యింది. స్టార్ హీరోల సినిమాలలో వరుస ఆఫర్స్ రావడంతో ఆమె ఒకేసారి 8 చిత్రాలను ఒకే చేసి, తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ అయ్యింది.
ఈ ఏడాది ఆమె నటించిన నాలుగు చిత్రాలు రిలీజ్ కాగా, మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి. రామ్ పోతినేని, బోయపాటి కాంబోలో వచ్చిన ‘స్కంద’ ఫ్లాప్ అవగా, ‘ఆదికేశ‌వ’ మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. తాజాగా రిలీజ్ అయిన నితిన్ హీరోగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్’ మూవీ కూడా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీలని ఐరన్ లెగ్ అంటూ నెట్టింట్లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
అయితే కొందరు శ్రీలలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఆమెను ఐరన్ లెగ్ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నెటిజెన్లు గుంటూరు కారం మూవీ కూడా ఫ్లాప్ అవుతుంది ఏమో అని ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అవ్వడానికి హీరోయిన్ ఒక్కరే ఎలా కారణం అవుతారు అని అంటున్నారు.

Also Read: గుడిలో “రజినీకాంత్” ని చూసి బిచ్చగాడు అనుకొని 10 రూపాయలు దానం చేసింది ఆ మహిళ..చివరికి ఏమైందంటే?

Previous articleగుడిలో “రజినీకాంత్” ని చూసి బిచ్చగాడు అనుకొని 10 రూపాయలు దానం చేసింది ఆ మహిళ..చివరికి ఏమైందంటే?
Next article2023 లో గూగుల్ లో ఎక్కువమంది వెతికింది ఈ రామ్ చరణ్ హీరోయిన్ గురించే అంట…ఎవరంటే.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.