Ads
సినిమాలు అన్నాక ప్రతి సినిమా భారీ బడ్జెట్ సినిమా అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా, కంటెంట్ బాగుంటే చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఒక సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా పేరు లవర్. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా పేరు ట్రూ లవర్. మణికందన్, గౌరీ ప్రియ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రభు రామ్ వ్యాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
సీన్ రోల్డాన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అరుణ్, దివ్య ప్రేమికులు. కాలేజీలో చదువుకునే రోజుల నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటారు. అరుణ్ ఒక కేఫ్ పెడదాం అనుకుంటాడు. దివ్య జాబ్ చేస్తూ ఉంటుంది. అరుణ్ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగోదు. తన తండ్రి రోజు తాగొచ్చి తల్లిని కొడుతూ ఉంటాడు. దాంతో అరుణ్ తల్లి, అరుణ్, దివ్య పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత వాళ్లు ఇల్లు మారితే వాళ్లతో పాటు కలిసి వెళ్లిపోదాం అని అనుకుంటూ ఉంటుంది.
Ads
కానీ మరొక పక్క అరుణ్ తో దివ్యకి సమస్యలు వస్తాయి. తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. సినిమా కాన్సెప్ట్ చాలా సహజంగా ఉంటుంది. యూత్ తో కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ వస్తే కచ్చితంగా హిట్ అవుతాయి. ఇది కూడా అలాగే అయ్యింది. సినిమాలో ఒకళ్ళని తప్పు అని, ఒకళ్ళని కరెక్ట్ అని చూపించలేదు. ఇద్దరికీ సెట్ అవ్వకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేది చూపించారు. అయితే చాలా సినిమాల్లో హీరో హీరోయిన్స్ చివరిలో కలిసిపోతే హ్యాపీ ఎండింగ్ అని చూపిస్తారు.
కానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్ కలిస్తేనే హ్యాపీ ఎండింగ్ కాదు అని చూపిస్తారు. సమాజంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎదుర్కొనే ఎన్నో సమస్యల గురించి ఈ సినిమాలో మాట్లాడారు. అరుణ్ తల్లిదండ్రులని చూపించి అలా తల్లిదండ్రులు ఉంటే ఆ ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది అనే విషయాన్ని కూడా ఈ సినిమాలో చాలా సున్నితంగా చూపించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తమిళ్ తో పాటు, తెలుగులో కూడా అందుబాటులో ఉంది. గత వారం విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ALSO READ : ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ మిస్టేక్ ని గమనించారా?