Ads
సహజంగా చాలా వరకు తమకు బాగా దగ్గర బంధువులనే వివాహాలు చేసుకుంటారు. వీటినే మేనరికపు పెళ్లిల్లు అని అంటారు. మేనరికం పెళ్ళిళ్ళు పాత కాలం నుండి వస్తున్న సాంప్రదాయం అని చెప్పాలి.
Ads
ఎక్కువ మంది పెళ్ళిళ్ళ విషయంలో ముందు తమ బంధువులలో ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. ఆ క్రమంలో మేన మరదలు కానీ, మేనకోడలు ఉంటే వారితో పెళ్లి జరిపిస్తారు. అయితే ఈ వివాహ విషయంలో ఆనందంగా కొంతమంది ఉండగా, కొందరు మాత్రం మేనరికం పెళ్ళిళ్ళ అంటే భయంతో వీటికి దూరంగా ఉంటున్నారు. మరి వాళ్ళందరూ మేనరికాపు పెళ్ళిళ్ళకి ఎందుకు భయపడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
ఈ రకపు పెళ్లిళ్ళు చేసుకున్న వారికి పుట్టబోయే బిడ్డకు రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటిలో ప్రధానంగా అంగవైకల్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా వినికిడి లోపంకూడా కనిపిస్తోంది. అయితే వీటికి ప్రధాన కారణం ఏంటి అంటే సాధారణంగా పుట్టబోయే బిడ్డకు తల్లి నుండి 23 క్రోమోజోములు మరియు తండ్రి నుండి 23 క్రోమోజోములు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇలా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుండి బిడ్డకు ముఖ్య సమాచారాన్ని చేరుస్తాయని సైన్స్ చెబుతోంది.పెళ్లి చేసుకున్న జంట రక్త సంబంధీకులు కానప్పుడు వారి బిడ్డకు సమాచారాన్ని చేర్చే ఒక జన్యువు తండ్రిలో లోపించినపుడు, తల్లి నుండి వచ్చే జన్యువుతో ఆ లోపం ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇదేవిధంగా తల్లిలో లోపించినపుడు, తండ్రి నుంచి వచ్చే జన్యువు వల్ల పుట్టబోయే బిడ్డ ఏ లోపం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలా కాకుండా భార్యాభర్తలు రక్త సంబంధీకులు అయినపుడు ఇద్దరు జన్యువులలోను లోపం ఉన్నప్పుడు దాన్ని సరి చేసే అవకాశం ఏది ఉండకపోవడంతో, ఆ పిల్లలకి జన్యుపరమైన లోపాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
Also Read: అమ్మాయిలూ.. 25 తరవాతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా..? సైన్స్ ఏం చెబుతోందంటే..?