Ads
సినిమా ధియేటర్ కి వెళ్లి మనం సినిమా చూసినప్పుడు సినిమాని ప్లే చేయడానికి ముందుకొని అడ్వర్టైజ్మెంట్లని ప్లే చేస్తారు. ఏ సినిమాని మొదలుపెట్టిన సరే మొదట మనం ధూమపానానికి సంబంధించిన అడ్వటైజ్మెంట్లను చూస్తూ ఉంటాము. నా పేరు ముఖేష్, రెండు గాజులు అమ్ముకున్నాను, ఈ నగరానికి ఏమైంది ఒకవైపు నుసి మరొకవైపు పొగ… ఇలా చాలా యాడ్లు కనబడుతూ ఉంటాయి.
అయితే వీటి మీద చాలా మంది జోకులు వేసుకుంటూ ఉంటారు. రెండు గాజులు అమ్ముకున్నానని ఇమిటేట్ చేయడం లేదంటే ఈ యాడ్ లని జోకులుగా తీసి పారేయడం ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉంటారు. ముఖేష్ పేరు చెప్తే నవ్వడం ఇలా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. అయితే మీరు కనుక ఈ విషయాలను తెలుసుకున్నారు అంటే ఇక అలా చేయరు.
ఈ అడ్వర్టైజ్మెంట్లని వాళ్ళు డబ్బుల కోసం చేయలేదు. వీళ్ళలా ఎవరు బాధపడకూడదు అని చేసారు. ముఖేష్ యాడ్ చూసి చాలా మంది విపరీతంగా ట్రోల్స్ చేశారు. ప్రతి సంవత్సరం పొగాకు వలన 80 లక్షల మంది చనిపోతున్నారు 70 లక్షలు మంది డైరెక్ట్ గా పొగాకు తీసుకుని చనిపోతుంటే.. పది లక్షల మంది పొగాకు పీలుస్తున్న వాళ్ళ కారణంగా చనిపోతున్నారు.
భారతదేశం పొగాకు వలన కలిగే అనర్థాలని తెలియజేయడానికి పొగాకు కారణంగా ఇబ్బంది పడ్డ వాళ్లని తీసుకువచ్చి ఈ విషయాలను చెప్పించింది. వాళ్లలో ముఖేష్ కూడా ఒకరు. మహారాష్ట్ర కి చెందిన ముఖేష్ రోజువారి కూలి కింద పని చేసేవాడు. తన సంపాదనతో కుటుంబం ఆధారపడేది. గుట్కా వ్యసనం తన జీవితాన్ని మార్చేసింది. ఒక ఏడాది పాటు గుట్కా ని తీసుకున్నాడు. ముఖేష్ ఆరోగ్యం పాడైంది. అయినా సరే వినలేదు. గుట్కాని తీసుకుంటూనే ఉండేవాడు.
Ads
నోటి క్యాన్సర్ వచ్చింది. ఆఖరికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అయితే ముఖేష్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో భారత ప్రభుత్వం అక్కడికి వెళ్లి యాడ్ ని షూట్ చేశారు. ముఖేష్ అప్పుడు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు అయినా కూడా గుట్కా వల్ల తాను పడ్డ సమస్యని చెప్పాడు టాటా మెమోరియల్ ఆసుపత్రి ముంబైలో ఈ అడ్వర్టైజ్మెంట్ ని షూట్ చేశారు.
డాక్టర్లు నోటి క్యాన్సర్ ఉందని ఓకల్ కార్డ్స్ ని తొలగించారు అయినా కూడా ఇబ్బంది పడ్డాడు. 27 అక్టోబర్ 2009లో ముఖేష్కర్ కన్నుమూశాడు. అలానే మరొక అడ్వర్టైజ్మెంట్ ని కూడా వేస్తున్నారు అందులో సునీత అనే ఒక ఆవిడ కనబడతారు. ఇక ఆమె గురించి చూద్దాం.. సునీతకి 30 ఏళ్లు పెళ్లి కూడా అయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆమెకి పొగాకు అలవాటు ఉండడంతో ఆమె క్యాన్సర్ బారిన పడింది.
2013 లో ట్రీట్మెంట్ తీసుకుంది. క్యాన్సర్ తగ్గిందని అనుకుంది కానీ మళ్లీ 2015 లో వచ్చింది. ఆవిడ ఆ తర్వాత చనిపోయారు. ఆమె చనిపోవడానికి ముందు మోడీకి ఉత్తరం రాసింది పొగాకు వలన నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేని అంటూ ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. అలానే తనకి ఎదురైన అనుభవం ద్వారా ఇతరులని హెచ్చరించాలని అని అనుకున్నారు.
నా జీవితంలా ఎవరి జీవితం అయిపోకూడదని ఆమె మోడీకి లెటర్ రాశారు. అయితే వీళ్లంతా కూడా బాధితులే. అంతే కానీ వీళ్ళు నటించలేదు వీరి యొక్క బాధను చూసి మరొకరు చెడు అలవాట్లకి బానిసలు కాకూడదని ఈ యాడ్స్ ని వేస్తారు తప్ప మనం ట్రోల్ చేయడానికో లేకపోతే చూసి నవ్వుకోడానికో కాదు ఇటువంటివి చూసైనా చాలా మంది మారతారని వీటిని తీసుకొచ్చారు.