తిరుమలలో చోటుచేసుకున్న ఘటన..! అదృష్టం అంటే ఆ భక్తురాలిదే..!

Ads

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశవ్యాప్తంగా వస్తుంటారు. విదేశీయులు సైతం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకి వస్తారనే విషయం తెలిసిందే.

తాజాగా తిరుమలలో ఒక ఇంట్రెస్టింగ్ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర,కొల్హాపూర్‌ నుండి మాధురి, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి స్వామి వారి దర్శనానికి తిరుమలకి వచ్చారు. ఎస్‌ఎంసీలోని ఒక గదిని రెంట్ కు తీసుకుని, దర్శనం పూర్తి అయిన తరువాత మంగళవారం నాడు రూమ్ ను ఖాళీచేసి వెళ్ళిపోయారు.  వారు వెళ్ళిన తరువాత ఆ గదిని శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య సిబ్బంది వెళ్లారు. అయితే శుభ్రం చేస్తున్న  క్రమంలో వారికి బంగారు నల్లపూసల గొలుసు కనిపించింది.
వెంటనే పారిశుద్ధ్య సిబ్బంది ఆ గొలుసు గురించిన సమాచారాన్ని ఎస్‌ఎంసీ ఎంక్వైరీ ఆఫీస్ అధికారులకు  తెలిపారు. సదరు అధికారులు వెంటనే మాధురికి ఫోన్ చేసి, నల్లపూసల గొలుసు గురించి తెలియచేశారు.  విషయం తెలియడంతో ఆ భక్తురాలు ఎంక్వైరీ కార్యాలయానికి తిరిగి వచ్చారు. ఆమెకు టీటీడీ ఆఫీసర్లు గొలుసును తిరిగి ఇచ్చారు. బంగారం గొలుసు అయినప్పటికీ, నిజాయితీగా సమాచారం ఇచ్చిన పారిశుద్ధ్య సిబ్బందిని ఆఫీసర్లు అభినందించారు.
అయితే ఆ భక్తురాలు బంగారు గొలుసును పోగొట్టుకున్న సంగతిని అసలు గమనించలేదు. ఆఫీసర్లు కాల్ చేయడంతో ఆమె అలర్ట్ అయ్యారట.గొలుసు పోయిన విషయాన్ని గ్రహించి, వెంటనే వెనక్కి వెళ్లి అధికారుల నుండి తన  గొలుసును తీసుకున్నారు. పోయిన బంగారు గొలుసు తిరిగి దొరకడంతో ఆ భక్తురాలు చాలా సంతోషపడ్డారు. గోలుసును చూసిన పారిశుద్ధ్య సిబ్బందికి మరియు టీటీడీ అధికారులకు మాధురి ధన్యవాదాలు తెలిపారు.

Ads

Also Read: TS ELECTIONS 2023 :తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఈ 5 మంది యువ నారీమణులు ఎవరో తెలుసా.?

Previous articleప్రతి దానికి “చిరంజీవి” ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..? కేవలం చిరంజీవి విషయంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోంది..?
Next articleఈ పోస్టర్‌లో ఉన్న సీనియర్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా..? 37 ఏళ్ళ తర్వాత..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.