Ads
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ఈ చిత్రం పీరియాడిక్ స్పై యాక్షన్ థ్రిలర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటించగా, మాళవిక నాయర్ కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 29న రిలీజ్ అయ్యి, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
Ads
ఓ మర్డర్ కేసు ఛేదించడం, స్వాతంత్రం ముందు బ్రిటిష్ వాళ్ళు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన అనుచరులని పట్టుకోవడం అనే స్టోరీతో తెరకెక్కింది. ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా సాగిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలోకి వచ్చింది. త్రివర్ణ పాత్ర రియల్ లైఫ్ లో నేతాజీ రైట్ హ్యాండ్. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
కళ్యాణ్ రామ్ ఈ మూవీ ప్రారంభంలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ గా కనిపిస్తారు. అయితే డెవిల్ నేతాజీ కోసం పని చేస్తారు. అయితే ఈ విషయం క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. ఇక ఈ మూవీలో వెతికే త్రివర్ణ ఎవరో కాదు డెవిల్. ఆమె నేతాజీ కుడి భుజం. కళ్యాణ్ రామ్ నటించిన ఈ త్రివర్ణ పాత్ర, నిజ జీవితంలో నేతాజీ రైట్ హ్యాండ్ అయిన సరస్వతి రాజమణిని స్ఫూర్తిగా తీసుకుని క్రియేట్ చేసిన పాత్ర. ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు.
సరస్వతి రాజమణి బర్మాలోని సంపన్న మరియు దేశభక్తి గల కుటుంబంలో జన్మించారు. 1937లో బర్మా(మయన్మార్)) పర్యటన సందర్భంగా, మహాత్మా గాంధీ బ్రిటిష్ వారి నుండి విముక్తి కోసం పోరాటంలో ఏకం కావాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో అతను రంగూన్‌లోని అత్యంత సంపన్న కుటుంబాన్ని కలిశాడు. ఆ కుటుంబం అంతా గాంధీని కలిసినప్పుడు, అతని 10 ఏళ్ల కుమార్తె రాజమణి మాత్రం వారి తోటలో తుపాకీతో ఆడుకుంది. గాంధీజీ ఆ అమ్మాయిని ఎందుకు షూటర్ కావాలని కోరుకుంటున్నావు అని అడిగారట. అప్పుడు ఆ అమ్మాయి నేను పెద్దయ్యాక కనీసం ఒక్క ఇంగ్లీషువాడినైనా చంపేస్తాను. వారు మనల్ని దోచుకుంటున్నారు.
నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్‌ఏ) విరాళాల కోసం బర్మా వెళ్ళినపుడు 16 ఏళ్ళ వయసు ఉన్న రాజమణి తన నగలన్నీ నేతాజీకి ఇచ్చారు. కానీ ఆయన వాటిని తిరిగి ఇవ్వగా, తిరస్కరించి ఐఎన్‌ఏలో చేరాలనుకుంది. నేతాజీ ఆమె తెలివి తేటలకు మెచ్చి రాజమణి పేరుకు ముందు సరస్వతి చేర్చారు. అప్పటి నుండి సరస్వతి రాజమణిగా మారింది. రాజమణిని, ఆమె స్నేహితులను నలుగురిని ఇండియన్ నేషనల్ ఆర్మీ గూఢచారి డిపార్ట్మెంట్ లో గూఢచారులుగా నియమించారు.
రాజమణి, ఆమె ఫ్రెండ్స్ మగవారి వేషంలో బ్రిటిష్ సైనిక శిబిరాలలో, అధికారుల ఇళ్ళలో పనివారుగా చేరారు. అలా బ్రిటిష్ అధికారుల మరియు ప్రభుత్వ సమాచారాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీకి చేరవేసేవారు. డెవిల్ మూవీ లో చూపించినట్టుగా నేతాజీని భారత్ కి రాకుండా ఆపి, ఆయన్ని రక్షించారు. ఆమె దేశంలోనే మొదటి మరియు అతి చిన్న వయసు ఉన్న గూఢచారిగా నిలిచారు.
Also Read: DEVIL REVIEW : “నందమూరి కళ్యాణ్ రామ్” డెవిల్ మూవీతో హిట్ కొట్టారా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్..!