Ads
Varasudu Review in Telugu: నటులు: దళపతి విజయ్, రష్మికా మందన్న, శరత్ కుమార్, శ్రీకాంత్, కిక్ శ్యామ్, జయసుధ తదితరులు
దర్శకుడు: వంశీ పైడిపల్లి
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్,
సంగీతం: తమన్
రిలీజ్ డేట్: జనవరి 11,2023
Varisu Review: టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన సినీమా ‘వారసుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై, వి పొట్లూరి,పెరల్ పెరమ్ , పీవీపీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించారు. నేడు ఈ సినీమా తమిళంలో విడుదల అయ్యింది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో ద్విబాషా చిత్రంగా ఒకేసారి తెరకెక్కించారు. ఈ చిత్రంలో దళపతి విజయ్ సరసన హీరోయిన్ రష్మిక మందన నటించారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. అయితే తెలుగులో ఈ మూవీ కొన్ని కారణాలవల్ల జనవరి 14వ తేదీకి వాయిదా పడింది. కథ:
రాజేంద్రన్ ప్రముఖ వ్యాపారవేత్త. అతనికి ముగ్గురు కొడుకులు. ఇద్దరు తండ్రితో పాటు వ్యాపారాలను చూసుకుంటూ ఉంటారు. మూడవ కొడుకి కి తన తండ్రి పద్ధతులు నచ్చక ఫ్యామిలీకి దూరంగా తనకు నచ్చినట్టుగా ఉంటాడు. అయితే రాజేంద్రన్ తన తరువాత తన బిజినెస్ కు సంబంధించిన బాధ్యతలను ముగ్గురు కొడుకులలో ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ స్థానం కోసం పెద్దవారిద్దరు ఈ చైర్మన్ కుర్చీ పైనే ఆశ పెట్టుకుంటారు. అయితే చిన్న కొడుకుకి దాని పై ఎలాంటి ఆశ ఉండదు.ఇక రాజేంద్రన్ కు వ్యాపారంలో ప్రత్యర్థి జై ప్రకాష్(ప్రకాష్ రాజ్) అనే బిజినెస్ మెన్ నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇంటికి తిరిగి వచ్చిన చిన్నకొడుకు జై ప్రకాష్ ను ఎలా అడ్డుకున్నాడు?చైర్మన్ తామే కావాలనే స్వార్థంతో ఉన్న తన అన్నలలో ఎలా మార్చాడు? నిజమైన వారసుడుగా ఎలా నిలబడ్డాడు అనేది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఇక సంక్రాంతి పండుగకు కుటుంబంతో సినీమా చూడాలనుకునే వారికి వారసుడు చిత్రం బెస్ట్ ఆప్షన్.
Varisu Review: సినీమా కార్పోరేట్ నేపద్యంలో కథ జరుగుతుంది.ఇందులో కుటుంబం, ముగ్గురు కొడుకులు, ఛైర్మన్ కుర్చీ కోసం సొంతవాళ్లకే వెన్ను పోటు పొడవడం కనిపిస్తాయి. జై ప్రకాష్ (ప్రకాష్ రాజ్) గ్రూప్ , రాజేంద్రన్ (శరత్ కుమార్) తో సినిమా మొదలవుతుంది. ఇక శరత్ కుమార్ కొడుకులు శ్రీకాంత్,కిక్ శ్యామ్,విజయ్ ల పరిచయం జరుగుతుంది. తండ్రితో గొడవపడి ఫ్యామిలీకి దూరంగా ఉన్న విజయ్ తిరిగి రావటంతో కథ ముందుకు సాగుతుంది.ఇంట్రవెల్ లో ట్విస్ట్ తరువాత విజయ్ తన తండ్రి బిజినెస్ తీసుకుని ప్రత్యర్థి జై ప్రకాష్ ను ఎదుర్కుంటాడు. అయితే కథ సినీమ చూస్తున్న ఆడియెన్స్ నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఊహించినట్టుగానే సాగుతుంది.
విజయ్ ని హైలెట్ చేసే సీన్స్ ప్లే అవుతుంటాయి. ఇవి విజయ్ అభిమానులు ఎంజాయ్ చేస్తారు. కానీ విజయ్ చిత్రాలను ఎక్కువగా చూడని వారు మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేరనే చెప్పాలి. అయితే ఆ సీన్స్ కథలో భాగంగానే వస్తాయి.సెకండ్ హాఫ్ లో హీరోయిజం, కామెడీ సీన్స్ మధ్య మధ్యలో సెంటిమెంట్ సన్నివేశాలు వస్తాయి.
ప్లస్ పాయింట్స్:
విజయ్ నటన
కామెడీ
యోగి బాబు సీన్స్
Ads
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
ఊహించినట్టుగా సాగే కథనం
రేటింగ్ : 2/5