Ads
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో 75వ సినిమాగా సైంధవ్ మూవీ చేశారు ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమా వెంకటేష్ కి హిట్ అందించిందా..? లేదా…? అనేది ఇప్పుడు చూద్దాం…
- చిత్రం: సైంధవ్
- నటీనటులు: వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్ధికి, ఆర్య,ఆండ్రియా,రుహిని శర్మ తదితరులు..
- దర్శకుడు: శైలేష్ కొలను
- సంగీతం: సంతోష్ నారాయణ్
- నిర్మాత: వెంకట్ బోయినపల్లి
- విడుదల తేదీ : జవనరి 13, 2024
కథ:
సైకో పర్సన్ అయిన సైంధవ్ ( వెంకటేష్ ) మనోజ్ఞ ( శ్రద్ధ శ్రీనాథ్ ) దంపతులకు గాయత్రి అనే ఒక పాప ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి చాలా సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. అయితే అదే సమయంలో వాళ్ళ పాపకి ఒక వ్యాధి సోకుతుంది. దాంతో ఆ పాపకి ఆ వ్యాధి క్యూర్ అవ్వడానికి 17 కోట్లు ఖరీదైన ఒక ఇంజక్షన్ చేయించాల్సి ఉంటుంది. ఇక దానికోసం వెంకటేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ కష్ట పడుతుంటాడు.
అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయిన వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు. దాంతో ఇంజక్షన్ చేయించడం చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇది ఇలా ఉంటే వెంకటేష్ కి అంతకుముందు వికాస్ మాలిక్ ( నవాజద్దీన్ సిద్ధికి ) తో కొన్ని గొడవలు ఉంటాయి. ఆ గొడవలకి ఈ పాప వ్యాధికి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? వెంకటేష్ తన పాపకి ఇంజక్షన్ చేయించి ఆ పాపని బ్రతికించుకున్నాడా లేదా అనే పూర్తి సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
Ads
డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాని చాలా కొత్తగా… స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఒక తండ్రి తన కూతురి కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనేది ఈ సినిమాలో చూపించారు.ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ సినిమాను నడిపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడానే చెప్పాలి. సినిమా చూస్తున్నంత సేపు ఉత్కంఠతో తర్వాత ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్ తో ప్రేక్షకులను నిమగ్నమయ్యేలా చేశారు.. నిజానికి వెంకటేష్ సినిమాలో సైకో టైప్ ఆఫ్ పాత్రను పోషించారు.
నవజద్దీన్ సిద్ధికి క్యారెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వెంకటేష్ కి పోటీగా నవజద్దీన్ చేసే ప్రయత్నాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో వెంకటేష్ , శ్రద్ధ శ్రీనాథ్ ఇద్దరు కూడా ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే ఉంటారో అలాంటి పాత్రను పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. ఆర్య కూడా ఇందులో మానస్ అనే పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో తన నటన కూడా బాగా ప్లస్ అయింది .
ఇక సినిమా కి సంతోష్ నారాయణ్ సంగీతం కూడా చాలా హెల్ప్ అయ్యింది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వెంకటేష్ కి పాపకి మధ్య వచ్చే సెంటిమెంటల్ సీన్స్ చాలా ఎలివేట్ చేసేలా ఉంది. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయట. సినిమాటోగ్రాఫీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు తగ్గట్టు చాలా స్టైలిష్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
- కథ, స్క్రీన్ ప్లే
- వెంకీ నటన
- బ్యాక్గ్రౌండ్ స్కోర్
- యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్:
- స్లో స్టార్ట్
- ఫ్లాట్ నేరేషన్
రేటింగ్:
3/5
ఫైనల్ గా:
వెంకీ మామని కొత్త అవతార్ లో చూడవచ్చు. యాక్షన్ మూవీస్ ని ,సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
watch trailer :