ట్రోల్ చేసిన వారికి వేణు స్వామి కౌంటర్..! ఏం అన్నారంటే..?

Ads

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అని వేణు స్వామి చెప్పారు. కానీ కూటమి గెలిచింది. దాంతో వేణు స్వామి మీద కామెంట్స్ మొదలు అయ్యాయి. చాలా మంది వేణు స్వామిని ట్రోల్ చేశారు. వేణు స్వామి ఆ తర్వాత సోషల్ మీడియాలో తాను ఇంక రాజకీయాల గురించి మాట్లాడదలచుకోలేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు వేణు స్వామి మరొక వీడియో షేర్ చేశారు. ఇందులో వేణు స్వామి తాను ఎన్నికల ఫలితాలు విడుదల అయిన తర్వాత నుండి కూడా తన పూజలలో ఉన్నాను అని అన్నారు. ట్రోలర్స్ వల్ల తనకి ఇంకా పూజలు చేసే అవకాశాలు వస్తున్నాయి అని అంటున్నారు.

venu swamy post about comments

“నేను చెప్పిన వాటిలో వందకి 98 99% జరిగాయి. జరగని విషయం గురించి నేను ఒప్పుకున్నాను. ఎంతో మంది జ్యోతిష్యులు, స్వామీజీలు తర్వాత మాట మార్చారు. కానీ వేణు స్వామి అలాంటివాడు కాదు. వేణు స్వామికి ధైర్యం ఉంది. ఈ ట్రోలింగ్ తర్వాత వేణు స్వామి ఎక్కడ ఉన్నారు అని నా ఫాలోవర్స్ భయపడుతున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు నుండి కూడా నా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నన్ను విమర్శించిన వారి వల్ల, ట్రోల్ చేసిన వారి వల్ల నాకు వచ్చే అంక్వైరీలు ఇంకా పెరిగాయి. అమ్మవారి దయ, నన్ను ట్రోల్ చేసిన వారి మీద, నా కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శించిన వారి మీద ఉండాలి అని కోరుకుంటున్నాను.”

“నేనేమీ వెయ్యి సుఖాలతో ఇక్కడికి వచ్చిన వాడిని కాదు. లక్షల కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. ఈ ట్రోల్స్ నాకు పెద్ద లెక్క కాదు” అంటూ వేణు స్వామి ఈ వీడియోలో చెప్పారు. సోషల్ మీడియాలో వేణు స్వామి యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వృత్తిపరమైన విషయాలు, రాశి ఫలాలు, ఎలాంటి రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా ఇందులో షేర్ చేస్తూ ఉంటారు.

Previous articleKalki 2898 AD Censor Talk : కల్కి 2898 ఏ.డీ. సెన్సార్ టాక్ వచ్చేసింది..! ప్రభాస్ కి మరొక హిట్ పడినట్టేనా..?
Next articleభ్రమరాంబ లాంటి అమ్మాయి కావాలి అని అనుకున్నాను… కానీ అదే నా పాలిట శాపం అయ్యింది..! ఏం జరిగిందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.