Ads
శివాని రాజశేఖర్, రాహుల్ విజయ్ హీరోగా నటించిన సినిమా విద్య వాసుల అహం. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో విడుదల అయ్యింది. మణికాంత్ గెల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రంజిత్ కుమార్ కొడాలి, నవ్య మహేష్, చందన కట్ట నిర్మించిన ఈ సినిమాకి, కళ్యాణి మాలిక్ సంగీత దర్శకత్వం వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, వైజాగ్ లో ఉండే వాసు (రాహుల్ విజయ్), పెళ్లి కోసం విద్య (శివాని రాజశేఖర్) రాసిన ఒక అప్లికేషన్ చూస్తాడు. విద్య చాలా తెలివిగల అమ్మాయి. తనకి కాబోయే భర్త ఎలా ఉండాలి అనే విషయం మీద విద్యకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అందుకే అప్లికేషన్స్ రూపంలో తన భర్తని ఎంచుకోవడానికి తన తల్లిదండ్రులని ఒప్పిస్తుంది.
అలా విద్యకి, వాసు నచ్చడంతో, వాళ్ళిద్దరికీ పెళ్లి అవుతుంది. పెళ్లయిన కొన్నాళ్ల వరకు బాగానే ఉంటారు. ఆ తర్వాత వాసు ఉద్యోగం పోతుంది. మెల్లగా వీళ్ళిద్దరి మధ్య ఈగో గొడవలు రావడం మొదలు అవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ. సినిమాలో హీరో, హీరోయిన్స్ మధ్య కథ నడిపించడం మాత్రమే కాకుండా, మధ్యలో, విష్ణుమూర్తి (శ్రీనివాస్ అవసరాల), లక్ష్మీదేవి (అభినయ), నారదుడు శ్రీనివాస రెడ్డి) మధ్య చర్చలు జరుగుతున్నట్టు చూపిస్తారు. హీరో, హీరోయిన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమాలో నటించిన వాళ్లందరి పెర్ఫార్మెన్స్ వారి పాత్రలకు తగ్గట్టు ఉంది. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. కొన్ని అనవసరమైన సీన్స్ ఉంటాయి.
Ads
కామెడీ పేరుతో హీరో చేత చేయించిన కొన్ని పనులు కూడా నవ్వు తెప్పించవు. చిరాకు తెప్పిస్తాయి. కథ కూడా బలహీనంగా అనిపిస్తుంది. డైలాగ్స్ విషయంలో కూడా ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎమోషనల్ డైలాగ్స్ కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు అనిపించవు. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. కళ్యాణి మాలిక్ అందించిన పాటలు గుర్తుపెట్టుకునే అంత గొప్పగా లేవు. అలా అని బాగాలేకుండా కూడా లేవు. సినిమాకి తగ్గట్టు అలా వెళ్లిపోతాయి అంతే.
అఖిల్ వెల్లూరి అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ బలహీనమైన కథ కారణంగా ఇవన్నీ కూడా పెద్దగా హైలైట్ అయినట్టు అనిపించవు. టేకింగ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉండేలాగా చూసుకొని ఉంటే సినిమాలో ఎమోషన్స్ తెరమీద బాగా కనిపించేవి. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, వీకెండ్ కి సరదాగా ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే, ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా విద్యా వాసుల అహం సినిమా నిలుస్తుంది.