Ads
తమిళ్ సంగీత దర్శకుడు, నటుడు…మంచి ప్రేక్షకుల ఆదరణ పొందిన వ్యక్తి విజయ్ ఆంటోని. ప్రస్తుతం అతని కుటుంబం విషాదఛాయలలో మునిగి ఉంది. తృటిలో జరిగిన ఒక అకస్మాత్తు సంఘటన కారణంగా ఈరోజు విజయ్ జీవితంలో చీకట్లు అలముకున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఒక్క రాత్రిలో అతని జీవితం తలకిందులైంది…అల్లారు ముద్దుగా కంటికి రెప్పగా పెంచుకున్న పదహారేళ్ళ కూతురు .. చనిపోవడం తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైన విషయం.
విజయ్ తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. స్వరకర్త, నిర్మాత ,నటుడు ,గీత రచయిత ,ఎడిటర్, ఆడియో ఇంజనీర్, డైరెక్టర్…ఇలా అతను సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో రకాల ఫీల్డ్స్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. విజయ్ భార్య ఫాతిమా వారి సొంత ప్రొడక్షన్ హౌస్ ని చూసుకుంటుంది. విజయ్ కు ఇద్దరు కూతుర్లు.. మీరా,లార.
చెన్నైలోని ప్రముఖ పాఠశాలలో 12 స్టాండర్డ్ చదువుతున్న మీరా గత కొద్ది కాలంగా డిప్రెషన్ తో పోరాడుతోంది. ఒత్తిడి తగించుకోవడం కోసం మీరా చికిత్స తీసుకుంటుంది. అయితే నిన్న సెప్టెంబర్ 19న చెన్నైలోని అల్వార్‌పేట్‌లోని వారి నివాసంలో తెల్లవారుజాము మూడు గంటలకు అతని కూతురు ఇంట్లో తన గదిలో ఉరిపోసుకుంది. తన కూతురు శవమై కనిపించడంతో విజయ్ తీవ్రమైన షాక్ కి లోనయ్యారు.
Ads
16 సంవత్సరాల మీరా చదువు ఒత్తిడి తట్టుకోలేక తన చున్నీతో ఫ్యాన్ కి ఉరి వేసుకుని సూ-సై-డ్ కు పాల్పడింది. ఈ విషయం గమనించి ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ…హాస్పిటల్ చేరే సమయానికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం పోలీసులు ఆమె మరణానికి సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.
ఈ కేసు దర్యాప్తులో మీరా సోమవారం రాత్రి 11 గంటల వరకు తన ల్యాప్‌టాప్‌ను ఉపయోగించిందని, ఆ తర్వాత మీరా ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. మీరా పాఠ్యపుస్తకంలో ఒక లెటర్ దొరికిందని అంటున్నారు. ఆ లెటర్ లో మీరా తన ఫ్రెండ్స్ ను, టీచర్స్ ను మిస్ అవుతున్నానని పేర్కొంది. అందరూ సురక్షితంగా మరియు సంతోషంగా ఉండండి. లవ్ యూ ఆల్ !! థాంక్యూ ఆల్ !! అని రాసినట్టు చెబుతున్నారు.
అయితే ప్రస్తుతం విద్యాసంస్థలు పిల్లలపై చదువు నెపంతో ఎటువంటి ఒత్తిడి పెడుతున్నాయి అనేదానికి బలైపోయినా మీరా జీవితం మరొక ఉదాహరణగా మిగులుతుంది. చనిపోయారే.. అయ్యో అనుకోవడం కంటే కూడా ఎందుకు చనిపోవాల్సి వచ్చింది…అన్న ప్రశ్న ముందుగా వస్తే మీరాలాగా మరి కొంతమంది పిల్లలు అనవసరంగా బలికాకుండా రక్షింపబడే అవకాశం ఉంది. చదువు మానవ వికాసానికే కానీ…మనసుపై కోలుకోలేని భారం పెట్టడానికి కాదు కదా.. ఈ విషయంలో ఒక్క స్కూల్ అనే కాదు తల్లిదండ్రులు కూడా సరియైన గైడెన్స్ పిల్లలకు అందివ్వాలి.