Ads
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఇంకొక రోజులో విడుదల అవుతుంది. సినిమా బృందం ప్రమోషన్స్ పనిలో ఉంది. సినిమా తెలుగుతో పాటు, తమిళ్ భాషలో కూడా విడుదల అవుతోంది. ఈ సినిమాని తెలుగు తమిళ్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేద్దాం అని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల హిందీలో ఈ సినిమా విడుదల చేయలేకపోతున్నారు. గోపి సుందర్ అందించిన పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి.
సినిమా ట్రైలర్ చూస్తూ ఉంటే ఇది ఒక కమర్షియల్ సినిమా అని తెలుస్తోంది. అందులోనే లవ్ స్టోరీ కూడా ఉంటుంది అని అంటున్నారు. సినిమాలో హీరో ఒక మిడిల్ క్లాస్ అతని పాత్రలో నటిస్తున్నారు. హీరో వేషధారణ చూస్తూ ఉంటే, అతను ఒక ఆర్కిటెక్ట్ అని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గెటప్ కూడా ఈ సినిమాలో కొత్తగా ఉంది. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. తన మార్కెట్ ని అభివృద్ధి చేస్తున్నారు.
Ads
అయితే ఈ సినిమాకి కూడా విజయ్ దేవరకొండ ఎక్కువ మొత్తంలోనే పారితోషకం తీసుకున్నారు. మొదట ఈ సినిమాకి పారితోషకం తీసుకోకుండా, వచ్చే ప్రాఫిట్స్ లో భాగాలు తీసుకుందాం అని విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ పెట్ల అనుకున్నట్టు సమాచారం. కానీ తర్వాత సినిమా షూటింగ్ చాలా వాయిదా పడింది. అనుకున్న షెడ్యూల్ కంటే లేట్ అయ్యింది. దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది.
అందుకే లాభాల్లో భాగాలు తీసుకుందాం అనే నిర్ణయాన్ని విరమించుకొని పారితోషకాన్ని తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ 15 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నారు. ఈ సినిమాకి 50 కోట్ల బడ్జెట్ అయినట్టు వార్తలు వచ్చాయి. సినిమా విడుదలకి ముందు అయ్యే బిజినెస్ కూడా మంచి మొత్తంలోనే జరిగింది. గీత గోవిందం కాంబినేషన్ కాబట్టి అదే స్థాయిలో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది అని అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.