Ads
ఇళయ దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ క్రేజీ కాంబోలో విడుదలైన చిత్రం లియో. విడుదలకు ముందు నుంచే ఎంతో హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వరుస హిట్లు కొడుతున్న లోకేష్ తన ముల్టివర్స్ లో భాగంగా తెరకెక్కించిన లియో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం..
- చిత్రం : లియో
- నటీనటులు : విజయ్, అర్జున్ సార్జా, త్రిష కృష్ణన్.
- నిర్మాత : లలిత్ కుమార్
- దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
- సంగీతం : అనిరుధ్ రవిచందర్
- విడుదల తేదీ : అక్టోబర్ 19, 2023
కథ:
పార్తిబన్ (విజయ్), అతని భార్యా(త్రిష) పిల్లలతో హిమాచల్ ప్రదేశ్ లో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఒక చాక్లెట్ ఫ్యాక్టరీ నడుపుతూఉంటాడు పార్తిబన్. సుఖంగా సాగుతున్న వాళ్ల జీవితంలో అనుకోకుండా ఎదురైన కొన్ని సంఘటనల కారణంగా అల్లకల్లోలం మొదలవుతుంది. పార్తిబన్ అతని కుటుంబం అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటారు. ఇంతకు పార్తిబన్ ఎవరు? వాళ్ళని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎవరు?ఆంటోనీ దాస్ (సంజయ్ దత్), హరోల్డ్ దాస్ (అర్జున్) కు పార్తిబన్ కు ఏంటి సంబంధం? లియో ఎవరు ? లియో కు పార్తిబన్ కు కనెక్షన్ ఏమిటి?
రివ్యూ :
ఇప్పటికే లియో చిత్రానికి ఓవర్సీస్ ప్రీమియర్స్ లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. విజయ యాక్షన్ తో పాటు, స్క్రీన్ ప్రజెన్స్, గ్రిప్పింగ్ గా సాగే స్టోరీ మూవీ పై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి కొన్ని ఫైటింగ్ సనివేశలు గూస్‌బంప్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో విజయ్ వన్ మ్యాన్ షో చేశాడు అని కచ్చితంగా చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్ లో ఒక సాధారణ వ్యక్తిగా కనిపించే హీరో.. సెకండ్ హాఫ్ లో ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టార్ గా రెండు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపిస్తారు.
Ads
మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది.లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌లో లియో మూవీ కూడా ఓ భాగమని, ఖైదీ, విక్రమ్ మూవీస్ తో ఈ మూవీ ను లింక్ చేసిన విధానంతో స్పష్టమైంది. ముఖ్యంగా మూడు సినిమాలు నీ లింక్ చేస్తూ లోకేష్ క్రియేట్ చేసిన సీన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్ :
- ఈ మూవీలో ప్రతి ఒక్కరు తమ వంతు ట్రేడ్ మార్క్ పెర్ఫార్మన్స్ ని అందించారు.
- అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది.
- యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
- సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది.
మైనస్ పాయింట్స్:
- స్టోరీ రొటీన్ గా ఉంటుంది.
- కాస్త అక్కడక్కడ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వవు.
- తెలుగులో సాంగ్స్ డబ్బింగ్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సింది.
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగా డ్రాగ్ అయ్యాయి.
రేటింగ్ :
3.25/5
ట్యాగ్ లైన్ :
లియో ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. మూవీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు స్టోరీ తెలిసిన పూర్తిగా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. దసరాకి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ఛాయిస్ మూవీ.
watch trailer :
ALSO READ : “భగవంత్ కేసరి”తో బాలయ్య హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!!