Ads
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి…హీరోయిన్ కత్రినా కైఫ్ జంటగా వచ్చిన చిత్రం మేరీ క్రిస్మస్… ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది? హిట్ అయిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
- చిత్రం: మేరీ క్రిస్మస్
- నటీనటులు: విజయ్ సేతుపతి,కత్రినా కైఫ్,సంజయ్ కపూర్,రాధిక అప్టే తదితరులు
- దర్శకుడు:శ్రీరామ్ రాఘవన్
- విడుదల తేదీ:జనవరి 12, 2024
కథ:
ఈ సినిమా కథ విషయానికి వస్తే చాలా చిన్నది. ఒక అన్ హ్యాపీ మ్యారేజ్ చేసుకున్న ఒక మహిళ, ఒక మిస్టరీ గతం ఉన్న ఒక పురుషుడు జీవితాలు ఒక క్రిస్మస్ రాత్రి ఎలా తలకిందులయ్యాయి అనేది ప్రధానాంశం.
రివ్యూ:
ఇది చాలా నెమ్మదిగా సాగే కథ. ప్రస్తుతం ఆడియన్స్ అందరూ కూడా ఫాస్ట్ నేరేషన్ స్టోరీస్ బాగా అలవాటు పడిపోయారు. అలాంటి సమయంలో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తను చెప్పాలనుకున్న కథని చాలా స్లో నేరేషన్ లో చాలా డీటెయిల్డ్ గా చెప్పాడు. తనకి నచ్చని పెళ్లి చేసుకుని జీవితం గడుపుతున్న ఒక మహిళ అలాగే, ఒక మిస్టరీ గతం అన్న ఒక పురుషుడు వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలు వారి గురించి చాలా డీటెయిలింగ్ తీసుకుని కథలోకి వెళ్ళాడు. ఒక క్రిస్మస్ రాత్రి వాళ్ళ జీవితాలు ఎలా తలకిందులయ్యాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు.
Ads
దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ లేటెస్ట్ మూవీ అందాధున్ స్క్రీన్ ప్లే బేస్డ్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఈ సినిమాని మీరే క్రిస్మస్ తో పోల్చి చూడడం సరైన విషయం కాదు. దానికి దీనికి అసలు సంబంధం లేదు. మేరీ క్రిస్మస్ మూవీ అంతా కూడా నిదానంగా సాగుతూ అసలు విషయం అంతా సెకండ్ హాఫ్ లో బయటపడుతుంది.అప్పటివరకు ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎందుకు జరిగిందనే విషయాలన్నీ ఒకేసారి స్పష్టమవుతాయి. దీంతో ఆడియన్స్ కి ఒక కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది.
అయితే ఆడియన్స్ కి సినిమా మీద ఇంట్రెస్ట్ సడలకుండా దర్శకుడు నడిపించాడు మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ ఏర్పడ్డ కూడా అది పెద్ద విషయం కాదు.
విజయ సేతుపతి, కత్రినా కైఫ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే అసలు ఈ సినిమాలో ఇంట్రెస్ట్ కలగడానికి ముఖ్యమైన కారణం వీళ్లే. ఇద్దరు కలిసి నటనతో స్క్రీన్ ని తన వైపు తిప్పేసుకున్నారు.ఆద్యంతం ఒకరిని మించి మరొకరు పెర్ఫాం చేస్తూ సినిమా అంత ఒక ఆరా సృష్టించారు. వీరికి సపోర్టింగ్ రోల్స్ లో నటించిన అశ్విని కల్ శేఖర్, షణ్ముఖరాజన్ కూడా తమ పరిధి మేరకు బాగా నటించారు.వీరి నటన సినిమాకి అడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్:
- ప్రధాన పాత్రల నటన
- స్క్రీన్ ప్లే
- డైరెక్షన్
- థ్రిల్లింగ్ ఎలిమెంట్స్
మైనస్ పాయింట్స్:
- స్లో నేరేషన్
- అర్దం కాని సీన్లు
రేటింగ్: 3/5
ఫైనల్ గా: ఎడ్జ్ సీట్ థ్రిల్లర్ మూవీలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది