Maharaja Review : మక్కల్ సెల్వన్ “విజయ్ సేతుపతి ” నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

విజయ్ సేతుపతి 50వ సినిమాగా రూపొందిన మహారాజా సినిమా. ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇదే పేరుతో ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం : మహారాజా
  • నటీనటులు : విజయ్ సేతుపతి, అభిరామి, మమతా మోహన్ దాస్, భారతి రాజా, అనురాగ్ కశ్యప్.
  • నిర్మాత : సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి
  • దర్శకత్వం : నితిలన్ సామినాథన్
  • సంగీతం : బి అజనీష్ లోక్‌నాథ్
  • విడుదల తేదీ : జూన్ 14, 2024

maharaja review

స్టోరీ :

మహారాజా (విజయ్ సేతుపతి) ఒక సెలూన్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఒక ప్రమాదంలో తన భార్య చనిపోతుంది. కూతురు జ్యోతి మాత్రం ఒక ఇనుప చెత్తబుట్ట ఆ అమ్మాయి మీద పడడంతో బతుకుతుంది. కూతురు ప్రాణాలు కాపాడింది అని చెత్తబుట్టకి లక్ష్మీ అని పేరు పెట్టుకుంటాడు. ఒకసారి లక్ష్మీ కనిపించకుండాపోతుంది. అప్పుడు జ్యోతి స్పోర్ట్స్ క్యాంప్ కి వెళుతుంది. తన కూతురు తిరిగివచ్చే వరకు చెత్తబుట్టని కనిపెట్టమని మహారాజా వెళ్లి పోలీసులని అడుగుతాడు.

పోలీసులు అందరూ వింతగా చూడడంతో, చెత్తబుట్టని కనిపెట్టడానికి తాను ఎంత డబ్బులు అయినా సరే ఇస్తాను అని చెప్తాడు. మరొక పక్క సెల్వ (అనురాగ్ కశ్యప్) తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. అసలు చెత్తబుట్ట కోసం మహారాజా ఎందుకు అలా వెతుకుతున్నాడు? అందులో ఏం ఉంది? చెత్త బుట్ట దొరికిందా? మహారాజాకి, సెల్వకి ఒకరికి ఒకరు తెలుసా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

50వ సినిమా అనేది చాలా మంది కెరీర్ లో ఒక మైలురాయి సినిమా. అలాంటి సినిమా గుర్తుండిపోయే విధంగా ఉండాలి అని అందరూ ఆశపడతారు. అయితే, విజయ్ సేతుపతి 50వ సినిమాగా తాను ఈ సినిమాని ఎంచుకోలేదు అని, ఈ సినిమానే తనని ఎంచుకుంది అని అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు విజయ్ సేతుపతి ఒక్క చోట కూడా గుర్తురారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఒకవేళ స్క్రీన్ ప్లే బాగుంటే సినిమా ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ ఆసక్తి పెంచడానికి కారణం స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ లో హీరో పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మాట్లాడే సీన్స్ కామెడీ తెప్పించే విధంగా ఉంటాయి. కానీ సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది సస్పెన్స్ పెరుగుతుంది. ఇంక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే, విజయ్ సేతుపతి ఈ సినిమాకి ప్రధాన బలం.

Ads

అసలు ఇలాంటి పాత్ర ఎంచుకున్నందుకు విజయ్ సేతుపతిని అభినందించాలి. ప్రతి సినిమాకి తనని తాను కొత్త రకంగా ఆవిష్కరించుకుంటూ వెళుతున్నారు. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర పోషించారు. మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈ సినిమాలో అభిరామి, మమతా మోహన్ దాస్ అంటారు. వాళ్లు కేవలం ఉన్నారు అంటే ఉన్నారు అని మాత్రం కాకుండా, వారి పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంది. అజనీష్ లోక్‌నాథ్ అందించిన పాటల కంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కథ తెలిసిన కథ. కొన్ని చోట్ల మాత్రం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • విజయ్ సేతుపతి
  • స్క్రీన్ ప్లే
  • కొన్ని ట్విస్ట్ సీన్స్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • కన్ఫ్యూజ్ చేసే కొన్ని సీన్స్

రేటింగ్ :

3.25/5

ట్యాగ్ లైన్ :

సినిమాలో పెద్దగా లోపాలు ఏమీ లేవు. ఉన్నవి కూడా అంత పెద్ద పట్టించుకునేవి కాదు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. కానీ ఒక విషయం ఏంటంటే, సినిమాకి వెళ్ళినప్పుడు దృష్టి మరల్చకుండా, సినిమా మీద మాత్రమే శ్రద్ధ పెట్టి చూడండి. ఎందుకంటే ఒక్క సీన్ మిస్ అయినా కూడా తర్వాత కొన్ని సీన్స్ అర్థం కావు. స్క్రీన్ ప్లే నాన్ లినియర్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో మహారాజా సినిమా కూడా ఒకటిగా నిలుస్తుంది.

watch trailer :

 

Previous articleహైదరబాద్ లో ఎన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్నాయో తెలుసా..?
Next articleథియేటర్లలో రిలీజ్ అయిన 15 రోజులకే OTT లోకి వచ్చిన విశ్వక్ సేన్ సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.