Ads
ఉప్పెన సినిమా తర్వాత టాలీవుడ్ లో ఉప్పెన సృష్టించిన నటి కృతి శెట్టి. ఫస్ట్ మూవీ తోటే గ్రాండ్ సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సరియైన హిట్టు లేక బాధపడుతుంది. కాంపిటీషన్ కూడా ఎక్కువ కావడంతో ఎలాగైనా మంచి హిట్ సంపాదించాలి అని తెలుగే కాకా తమిళ్ ,మలయాళం భాషల్లో కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఉప్పెన సినిమాలో కృతి శెట్టి విజయ్ సేతుపతి కూతురుగా నటించిన సంగతి తెలిసిందే…
ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి హీరోగా ఉన్న ఒక సినిమా ఆఫర్ కృతి కి మిస్ అయిపోయింది. ఇంతకీ దీని రీజన్ ఏమిటంటే.. హీరోయిన్ ఫోటో చూసి విజయ్ సేతుపతి ఈమెతో అయితే నేను చేయను అని రిజెక్ట్ చేయడమే…అయితే ఈ విషయం గురించి విజయ్ సేతుపతి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిజానికి అతను చెప్పిన రీజన్ ఎథికల్ గా చాలా కరెక్ట్ అనిపించింది.
Ads
ఇంతకీ ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే..” ఉప్పెన చిత్రంలో బేబమ్మకు తండ్రిగా నటించాను.. ఈ మూవీ తర్వాత నేను చేయబోయే నెక్స్ట్ తమిళ్ మూవీ కి హీరోయిన్ గా కృతి శెట్టి బాగుంటుంది అని మేకర్స్ భావించినప్పటికీ…హీరోయిన్ ఫోటో చూసిన నేను మాత్రం తాను హీరోయిన్గా వద్దు అని చెప్పాను.
ఒక హీరోలో ఆమెకు తండ్రిగా నటించి వెంటనే ఆమెతో రొమాంటిక్గా నటించడం నాకిష్టం లేదు. అందుకే అలా చెప్పాను”అని విజయ్ సేతుపతి అన్నారు. తమ మనవరాలు వయసు ఉన్న హీరోయిన్లతో సైతం సరసాలు వాడే అగ్రనటులను చూస్తున్న మనకు అడపాదడపా ఇలాంటి రియల్ హీరోలు కనిపిస్తూ ఉంటారు.