Ads
కొత్త కాన్సెప్ట్ ఉన్న కథలు ఎంచుకుంటున్న హీరోల్లో యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఒకరు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
- నటీనటులు : విశ్వక్ సేన్, నేహా శెట్టి, అంజలి.
- నిర్మాత : సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
- దర్శకత్వం : కృష్ణ చైతన్య
- సంగీతం : యువన్ శంకర్ రాజా
- విడుదల తేదీ : మే 31, 2024
స్టోరీ :
లంకల రత్నాకర్ అలియాస్ రత్న (విశ్వక్ సేన్) వాయిస్ ఓవర్ తోనే సినిమా మొదలవుతుంది. రత్న ఏదో కావాలి అని కలలు కంటూ ఉంటాడు. ఏదైనా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే ఊరిలో ఉండే బుజ్జి (నేహా శెట్టి) ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. బుజ్జి అదే ఊళ్లో ఉండే నానాజీ (నాజర్) కూతురు. మరొక పక్క రత్న, రత్నమాల (అంజలి) తో కూడా సన్నిహితంగా ఉంటాడు.
ఆ ఊరి ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) తో పాటు రత్న చేరుతాడు. రత్న కొన్ని తప్పుడు పనులు కూడా చేస్తాడు. అసలు రత్న జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నాడు? ఎందుకు ఎమ్మెల్యేతో చేరుతాడు? ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? తన గ్యాంగ్ తోనే రత్నకి ఎందుకు గొడవ జరుగుతుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈమధ్య విలేజ్ నేపథ్యం ఉన్న సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సినిమాల్లో అయితే ఎమోషన్స్ ని ఇంకా సహజంగా చూపించే అవకాశం ఉంటుంది అని చాలా మంది ఇదే నేపథ్యాన్ని ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇలాగే వచ్చింది. సినిమా టైం లైన్ కూడా 80 కాలంలో ఉంటుంది. సినిమా ఓపెనింగ్ చాలా బాగుంటుంది. ఒక మంచి స్టోరీ పాయింట్ తో మొదలవుతుంది. కథ తెలిసిన కథ. కానీ కథనం పరంగా వేగంగా అనిపిస్తుంది. కానీ తర్వాత సినిమా ముందుకి వెళ్లే కొద్దీ రొటీన్ గా అనిపించడం మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక మంచి నోట్ తో ముగుస్తుంది. ఫస్ట్ ఆఫ్ అంత బాగా సెకండ్ హాఫ్ ఉన్నా కూడా సినిమా ఇంకొక రకంగా ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు.
Ads
సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల అసలు సీన్స్ సరిగ్గా రాసుకోలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో చాలా నడుస్తూ ఉంటుంది. హీరో ఒక సాధారణ అబ్బాయిగా మొదలుపెట్టి, ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లల తండ్రి అయ్యి, ఎలక్షన్స్ లో పాల్గొని, ముందు గెలిచి, తర్వాత తన గుర్తింపు పెంచుకొని, ఆ తర్వాత ఓడిపోయి, చివరికి చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత తిట్టించుకునే అంత దూరం వెళ్తాడు. ఇంత జరుగుతున్నా కూడా ఎమోషన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వవు. హీరో పాత్ర డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. యంగ్ గా ఉన్నప్పుడు తాను చేసిన తప్పులని తర్వాత తెలుసుకున్నట్టు చూపిస్తారు. అలాంటి పరిణితి ఉన్న పాత్రలు చాలా తక్కువగా ఉంటాయి.
కానీ ఎమోషన్స్ లో బలం తక్కువగా అనిపిస్తుంది. కొన్ని ట్విస్ట్ సీన్స్ అయితే తెలిసిపోతాయి. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ కి ఒక మంచి పాత్ర లభించింది. సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం చాలా బాగుంది. కొన్నిచోట్ల మిస్ అయినా కూడా గోదావరి యాస విశ్వక్ సేన్ బాగానే పట్టారు. నేహా శెట్టి చూడడానికి బాగున్నారు. నటనకి ఆస్కారం పెద్దగా లేకపోయినా కూడా ఉన్నంతవరకు బాగా చేశారు. అంజలి పాత్ర బాగుంది. అంజలి నటించిన విధానం ఇంకా బాగుంది. గోపరాజు రమణ, ప్రవీణ్, హైపర్ ఆది ఇలా చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అనిత్ మాదడి సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక హైలైట్. యువన్ శంకర్ రాజా అందించిన పాటల కంటే, నేపథ్య సంగీతం చాలా బాగుంది. పాటలు కూడా ఒకటి, రెండు బాగున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ రాసుకున్న విధానం బాగుంది. అవి డిజైన్ చేసిన విధానం కూడా కొత్తగా అనిపించింది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- విశ్వక్ సేన్
- పాటలు
- యాక్షన్ సీన్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- సాగదీసినట్టుగా అనిపించే సీన్స్
- సెకండ్ హాఫ్ లో బలంగా లేని స్క్రీన్ ప్లే
- కనెక్ట్ అవ్వని కొన్ని ఎమోషన్స్
రేటింగ్ :
2.25/5
ట్యాగ్ లైన్ :
కథనం నుండి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, విశ్వక్ సేన్ కోసం, అసలు ఇలాంటి ఒక పాత్రలో విశ్వక్ సేన్ ఎలా నటించారు అని చూడాలి అనుకుంటే మాత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :