థియేటర్లలో రిలీజ్ అయిన 15 రోజులకే OTT లోకి వచ్చిన విశ్వక్ సేన్ సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

Ads

విశ్వక్ సేన్ హీరోగా, నేహ శెట్టి హీరోయిన్ గా నటించిన సినిమా గ్యాం-గ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా గత నెల చివరిలో థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా థియేటర్లలోకి వచ్చి సరిగ్గా 15 రోజులు అయ్యింది. ఇవాళ నుండి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. అంజలి ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

vishwak sen new movie on ott

ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, లంకల రత్నాకర్ అలియాస్ రత్న (విశ్వక్ సేన్) వాయిస్ ఓవర్ తోనే సినిమా మొదలవుతుంది. రత్న ఏదో కావాలి అని కలలు కంటూ ఉంటాడు. ఏదైనా ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే ఊరిలో ఉండే బుజ్జి (నేహా శెట్టి) ని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాడు. బుజ్జి అదే ఊళ్లో ఉండే నానాజీ (నాజర్) కూతురు. మరొక పక్క రత్న, రత్నమాల (అంజలి) తో కూడా సన్నిహితంగా ఉంటాడు.

ఆ ఊరి ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) తో పాటు రత్న చేరుతాడు. రత్న కొన్ని తప్పుడు పనులు కూడా చేస్తాడు. అసలు రత్న జీవితంలో ఏం కావాలి అనుకుంటున్నాడు? ఎందుకు ఎమ్మెల్యేతో చేరుతాడు? ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? తన గ్యాంగ్ తోనే రత్నకి ఎందుకు గొడవ జరుగుతుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమా ఓపెనింగ్ చాలా బాగుంటుంది. ఒక మంచి స్టోరీ పాయింట్ తో మొదలవుతుంది. కథ తెలిసిన కథ. కానీ కథనం పరంగా వేగంగా అనిపిస్తుంది.

Ads

కానీ తర్వాత సినిమా ముందుకి వెళ్లే కొద్దీ రొటీన్ గా అనిపించడం మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్ ఒక మంచి నోట్ తో ముగుస్తుంది. ఫస్ట్ ఆఫ్ అంత బాగా సెకండ్ హాఫ్ ఉన్నా కూడా సినిమా ఇంకొక రకంగా ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల అసలు సీన్స్ సరిగ్గా రాసుకోలేదేమో అన్నట్టు అనిపిస్తుంది. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో చాలా నడుస్తూ ఉంటుంది.

హీరో ఒక సాధారణ అబ్బాయిగా మొదలుపెట్టి, ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకొని, ఇద్దరు పిల్లల తండ్రి అయ్యి, ఎలక్షన్స్ లో పాల్గొని, ముందు గెలిచి, తర్వాత తన గుర్తింపు పెంచుకొని, ఆ తర్వాత ఓడిపోయి, చివరికి చుట్టూ ఉన్న వాళ్ళందరి చేత తిట్టించుకునే అంత దూరం వెళ్తాడు. ఇంత జరుగుతున్నా కూడా ఎమోషన్స్ ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వవు. హీరో పాత్ర డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. యంగ్ గా ఉన్నప్పుడు తాను చేసిన తప్పులని తర్వాత తెలుసుకున్నట్టు చూపిస్తారు. అలాంటి పరిణితి ఉన్న పాత్రలు చాలా తక్కువగా ఉంటాయి.

కానీ ఎమోషన్స్ లో బలం తక్కువగా అనిపిస్తుంది. కొన్ని ట్విస్ట్ సీన్స్ అయితే తెలిసిపోతాయి. ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, విశ్వక్ సేన్ కి ఒక మంచి పాత్ర లభించింది. సినిమా కోసం తనని తాను మార్చుకున్న విధానం చాలా బాగుంది. నేహా శెట్టి చూడడానికి బాగున్నారు. నటనకి ఆస్కారం పెద్దగా లేకపోయినా కూడా ఉన్నంతవరకు బాగా చేశారు. అంజలి పాత్ర బాగుంది. అంజలి నటించిన విధానం ఇంకా బాగుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. సెట్టింగ్స్ చాలా బాగున్నాయి. అనిత్ మాదడి సినిమాటోగ్రఫీ సినిమాకి మరొక హైలైట్. యువన్ శంకర్ రాజా అందించిన పాటల కంటే, నేపథ్య సంగీతం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

Previous articleMaharaja Review : మక్కల్ సెల్వన్ “విజయ్ సేతుపతి ” నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleభర్తకి ఎడమ వైపే భార్య ఎందుకు ఉండాలి..? దాని వెనుక ఎంతో పెద్ద కారణం వుంది..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.