Ads
సాధారణంగా సెలబ్రిటీలు అంటేనే లగ్జరీ బ్రాండ్లకి పెట్టింది పేరు. వాళ్లు ఫంక్షన్ కి అటెండ్ అయ్యారంటే వాళ్ళు ఏ బ్రాండ్ డ్రెస్ వేసుకున్నారు, ఏ బ్రాండ్ ఆక్సెసరీస్ పెట్టుకున్నారు అంటూ దృష్టి మొత్తం వాళ్ల మీదే పెడతారు అభిమానులు.
అభిమానుల అంచనాలకు తగినట్టుగానే సెలెబ్రిటీలు సైతం లగ్జరీ బ్రాండ్లకు ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు అలాగే విశ్వక్ సేన్ షూ కూడా హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, రాజీవ్ కనకాల, సుమ దంపతుల కుమారుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న బబుల్ గమ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో డిసెంబర్ 24న జరిగింది. ఈ సినిమాకి సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవి శేష్ ముఖ్య అతిదులు గా పాల్గొన్నారు. అయితే సుమ వాళ్లని వేదిక మీదకి పిలిచి హబీబీ జిలేబి పాటకి డాన్స్ చేయమని కోరింది. తాను చేయలేనని చెప్పి తన షూ చూపించాడు విశ్వక్ సేన్. వాటిని చూసిన సుమ ఒకసారిగా షాక్ అయింది.
Ads
ఇవి షూస్ ఏనా.. ఎక్కడ దొరికాయి దయచేసి మాకు ఇస్తే బట్టలు అందులో స్టోర్ చేసుకుంటాం అంటూ ఆటపట్టించింది. వెంటనే అడవి శేష్ మాట్లాడుతూ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పడవలు వేసుకుని వచ్చేసాడు అంటూ చలోక్తి విసిరాడు. అయితే వెంటనే విశ్వక్ సేన్ ఊరుకోకుండా నేను డాన్స్ చేస్తాను కానీ నా పక్కన డాన్స్ చేసిన వాళ్ళ కాళ్ళని తొక్కితే ఫీల్ కావద్దు అని నవ్వుతూ కౌంటర్ వేశాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఆ చెప్పులు మీద పడింది.
ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ నలుపు రంగు వెరైటీ చెప్పులు వేసుకుని వెళ్లారు. నిజానికి ఆ చెప్పులు క్లాగ్స్ లా ఉన్నాయి. ఫోర్ వీలర్ కి ముందు వెనక నెంబర్ ప్లేట్ల మాదిరిగా బ్రాండ్ నేమ్ ను మెటల్ ప్లేట్ల మీద రాసి తగిలించారు. ఆ చెప్పుల బ్రాండ్ పేరు బలెన్సియాగ. 104 ఏళ్ల క్రితం స్పెయిన్ లో పుట్టిన లగ్జరీ బ్యాండ్. రబ్బర్ తో తయారుచేసిన మ్యూల్ శాండిల్స్ ఇవి. వీటి ఖరీదు అక్షరాల 98, 975 రూపాయలు. వీటి ధర చూసిన నెటిజెన్స్ అంత ఖరీదా అంటూ షాక్ అవుతారు.