గుంటూరు కారం ట్రైలర్‌లో రమ్యకృష్ణకి ప్రశ్న వేసిన ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టారా..?

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమా ట్రైలర్ నిన్న విడుదల చేశారు. సుదర్శన్ థియేటర్ లో అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్ ని విడుదల చేశారు. జనవరి 9వ తేదీన గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది.

ఈ ఈవెంట్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారు. సినిమా ట్రైలర్ లో మహేష్ బాబుతో పాటు, సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటీనటులు అందరూ కూడా కనిపిస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు వైరా వెంకట రమణా రెడ్డి అనే పాత్రలో నటిస్తున్నారు.

changes in guntur kaaram

సినిమా మదర్ సెంటిమెంట్ తో ఉంటుంది అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. సినిమా ట్రైలర్ మొదటి షాట్ కూడా రమ్యకృష్ణ ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నట్టే మొదలవుతుంది. ఈ సీన్ లో రమ్యకృష్ణతో పాటు, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కూడా కనిపిస్తున్నారు. అయితే ఈ సీన్ లో రమ్యకృష్ణకి ఒక వ్యక్తి ప్రశ్న వేస్తారు. ఆ వాయిస్ ఎవరిదో తెలియడం కొంచెం కష్టమే అయ్యింది.

voice in guntur kaaram trailer

Ads

అయినా కూడా సోషల్ మీడియా పుణ్యమా అని ఆ వాయిస్ ఎవరిది అనేది తెలిసిపోయింది. ఆ వాయిస్ ఎవరిదో కాదు. సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దే. “మీ పెద్ద కొడుకుని ఒక అనాధలాగా వదిలేసారు అని అంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి?” అని ఈ ప్రశ్న ఉంటుంది. ఆ గొంతుని సరిగ్గా గమనిస్తే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ గొంతు అని అర్థం అవుతోంది. మరి సినిమాలో ఈ ప్రశ్న వేసింది ఎవరో అనేది ఇంకా తెలియదు.

voice in guntur kaaram trailer

ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు, కొంచెం కామెడీ, చివరిలో కొంచెం ఎమోషన్ కూడా యాడ్ చేశారు. సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా బృందం కూడా ప్రమోషన్ ఇంటర్వ్యూలు ఇస్తారు. ఈసారి సంక్రాంతి బరిలో చాలా సినిమాలు నిలుస్తున్నాయి. దాంతో ప్రతి సినిమా వాళ్లు కూడా తమ స్టైల్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పుడు గుంటూరు కారం టీం కూడా అలాగే ప్రమోషన్స్ చేస్తారు అని తెలుస్తోంది. సినిమాలో హీరో తండ్రి పాత్రలో జయరాం నటిస్తున్నారు. అలాగే మరొక ముఖ్య పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపిస్తారు.

watch trailer :

Previous articleగుంటూరు కారం ట్రైలర్‌లో ఈ విషయం గమనించారా..? దీని వెనుక ఇంత పెద్ద కారణం ఉందా..?
Next article1880 లో హైదరాబాద్ ఎలా ఉందో చూశారా..? అప్పట్లో చార్మినార్ ఎలా ఉండేది అంటే..?