WPL AUCTION: మహిళల ఐపీఎల్ లో 10 లక్షల నుండి 1.3 కోట్లకు…ఇంతకీ ఎవరు ఈ వృందా దినేశ్?

Ads

ప్రస్తుతం ఐపీఎల్ బిడ్డింగ్ ల ద్వారా ప్లేయర్లు కోట్లు సంపాదిస్తున్నారు. మహిళా క్రికెటర్లు కూడా తామేమి తక్కువ కాదంటూ ఉమెన్ ప్రీమియర్ లీగ్లలో కోట్లు సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ తో పాటు, ఉమెన్ ప్రీమియర్ లీగ్ కూడా బిడ్డింగ్ లు జరిగి ఫ్రాంచైజీలు ప్లేయర్లను సొంతం చేసుకుంటున్నాయి.

సాధారణంగా స్పోర్ట్స్ బిడ్డింగ్‌లో స్టార్ ప్లేయర్లు కోట్లకు పడగలెత్తుతుంటారు. ఆ ప్లేయర్స్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఫ్రాంచైజీలు సైతం పోటీపడి మరీ వేలానికి వెళ్తాయి. కానీ అన్‌క్యాప్డ్ ప్లేయర్ల విషయంలో మాత్రం అంత పోటీ ఉండదు. వారికి లక్షలు రావడం కూడా గగనమే.అయితే. వృందా దినేశ్ అనే క్రీడాకారిణి మాత్రం తొలిసారి కోటికి పడగలెత్తింది. ఉమెన్ ప్రీమియర్ లీగ్-2024లో ఆమె 1.3 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు.

Ads

తొలుత వేలంలో రూ.10 లక్షల బేస్ ధరతో వేలం మొదలయ్యింది. ఈ 22 ఏళ్ల క్రీడాకారిణిని సొంతం చేసుకోవడం కోసం గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడ్డాయి. మధ్యలో యూపీ వారియర్స్ రంగంలోకి దిగింది.చివరికి ఆ ఫ్రాంచైజీ రూ.1.3 కోట్లకు ఆమెను సొంతం చేసుకుంది. తొలిసారి ఓ అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఈ స్థాయిలో అమ్ముడుపోవడంతో వృందా దినేశ్ గురించే చర్చలు నడుస్తున్నాయి. ఆమె ఎవరు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంత డిమాండ్ ఎందుకు? అనే అంశాలపై మాట్లాడుకుంటున్నారు.

కర్ణాటకకు చెందిన వృందా. కన్సిస్టెన్సీకి, భారీ షాట్లకు పేరుగాంచింది. హాంకాంగ్‌లో జరిగిన 2023 ACC ఎమర్జింగ్ టీమ్స్ కప్‌లో భారత జట్టులో స్థానం సంపాదించినప్పుడు ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన వృందా కేవలం 29 బంతుల్లో 36 పరుగులు చేసి భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. సీనియర్ మహిళల వన్డే పోటీలో కర్నాటక ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె ఎంతో కీలక పాత్ర పోషించారు. ఆ సిరీస్‌లో మొత్తం 11 మ్యాచ్‌ల్లో 477 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన మూడో క్రీడాకారిణిగా నిలిచింది.

Previous articleBJP MLA CAR NUMBER: తెలంగాణాలో ఇద్దరు సీఎం క్యాండిడేట్లను ఓడించిన ఈ బీజేపీ ఎమ్మెల్యే కార్ నెంబర్ గమనించారా.?
Next articleసినిమా రంగంలో సక్సెస్ అయిన సరిత నిజ జీవిత కథ గురించి తెలుసా..? 16 సంవత్సరాలకే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.