Ads
కొన్ని కొన్ని చట్టాలను చూస్తే చాలా వింతగా అనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఇటువంటివి విన్నారా..? నిజంగా ఈ చట్టాలని చూస్తే ఆశ్చర్యపోతారు. మన భారతదేశంలో చాలా నార్మల్ గా కనబడతాయి. కానీ ఇతర దేశాలలో చూస్తే తప్పుగా నేరంగా భావిస్తారు. మరి అటువంటి వింత చట్టాల గురించి ఇప్పుడు చూద్దాం.
#1. బ్లూ జీన్స్ బ్యాన్:
నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశంలో బ్లూ కలర్ జీన్స్ ని బ్యాన్ చేశారు వెస్ట్రన్ కల్చర్ నుండి ప్రజలు దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
#2. పావురాలకి ఆహారం వేయడం:
సాన్ ఫ్రాన్సికో లో పావురాలకి ఆహారం ఇవ్వడం చట్ట విరుద్ధం. మనదేశంలో పావురాలకి ఆహారం వేయడాన్ని చాలా మంచి దానిగా భావిస్తారు.
#3. ముఖాన్ని కవర్ చేసుకోకూడదు:
డెన్మార్క్ లో ముఖాన్ని కవర్ చేసుకోవడం తప్పుగా భావిస్తారు. పబ్లిక్ ప్లేసులలో ముఖాన్ని కవర్ చేసుకోవడం ఇక్కడ తప్పు. 2018లో డానిష్ పార్లమెంట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
#4. డబ్బులుని తొక్కకూడదు:
థాయిలాండ్ లో డబ్బులు తొక్కడం చట్ట విరుద్ధం ఎందుకంటే ఈ నోట్ల మీద రాయల్ ఫ్యామిలీ వాళ్ళ ఫోటోని ప్రింట్ చేశారు.
Ads
#5. విక్స్ ని ఉపయోగించకూడదు:
జపాన్లో విక్స్ ని బ్యాన్ చేశారు. ఇందులో సుడోఎఫేడ్రినే (Pseudoephedrine)అనే ఈ డ్రగ్ ఉంటుందని జపాన్లో విక్స్ నిషేధించారు.
#6. 10 గంటల తర్వాత ఫ్లష్ చేయకూడదు:
స్విజర్లాండ్ లో రాత్రి 10:00 తర్వాత ఫ్లెష్ చేయకూడదు. ధ్వని కాలుష్యం అవుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
#7. హై హీల్స్ వేసుకోకూడదు:
గ్రీస్ లో హై హీల్స్ వేసుకోవడం తప్పు. వీటి వలన చారిత్రక కట్టడాలు వంటివి దెబ్బతింటాయని ఈ రూల్ ని తీసుకువచ్చారు.
#8. బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీలు తీసుకోకూడదు:
శ్రీలంకలో బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీలు తీసుకోవడం తప్పు. దీనికి కారణం ఏమిటంటే సెల్ఫీ తీసుకునే సమయంలో బుద్ధుడు వైపు వెనుక భాగం ఉంటుంది. అందుకని ఈ రూల్ ని తీసుకువచ్చారు.
#9. భార్య పుట్టిన రోజు మర్చిపోవడం నేరం:
సామోఆ లో భార్య పుట్టిన రోజుని మర్చిపోవడమే నేరంగా పరిగణిస్తారు. పాలినేషియా ప్రాంతం పసిఫిక్ ఓషన్ లో భార్య పుట్టిన రోజు మర్చిపోతే జైలులో పెడతారు.