ప్రస్తుతం అమ్మాయిలు చున్నీలు ఎందుకు వేసుకోట్లేదు అన్న ప్రశ్నకు…ఈ అమ్మాయి ఇచ్చిన సమాధానంకి మీ కామెంట్ ఏంటి.?

Ads

గత కొద్ది కాలంగా విస్తృతంగా పెరుగుతున్న ఫ్యాషన్ ప్రపంచం కారణంగా జనాల వస్త్రధారణలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ట్రెండీగా కనిపించాలి అనే ఉద్దేశంతో మనకు సెట్ అవుతుందా లేదా అని కూడా ఆలోచించకుండా మార్కెట్లో ఏ ఫ్యాషన్ కొత్తగా ఉంటే అందరూ దాన్ని ఫాలో అవ్వడం అలవాటు చేసుకున్నారు. అయితే ఈ విషయంలో మగవారిపై ఎవరు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయరు కానీ ఆడవారి వస్త్రధారణ పై ఎక్కువగా విమర్శలు చేయడంతో పాటు వాళ్ళు వేసుకునే వస్త్రాలను బట్టి క్యారెక్టర్ని జడ్జ్ చేసే జనం మన చుట్టూ ఉన్నారు.

representative image

ఒకప్పుడు ఆడవారు నిండుగా చీర కట్టుకునేవారు ఆ తరువాత కంఫర్ట్ కోసం పంజాబీ డ్రెస్సులు అలవాటు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మరీ కంఫర్టబుల్ గా టాప్ మరియు లెగ్గింగ్స్ తో సరిపెట్టుకుంటున్నారు. అయితే చాలామంది డ్రెస్సులు పై చున్నీలు వేసుకోవడానికి ఇష్టపడడం లేదు. రెండుగా ఉండడం కోసం కొందరు మ్యాచింగ్ కోట్ వంటి వస్త్రాలను ధరిస్తున్నారు.

Ads

representative image

ఆడవారి వస్త్రధారణలో మాయమైన ఈ చున్నీ గురించి ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈ ప్రశ్నకు లలిత అనే కోరా యూజర్ అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం ఇచ్చారు.”నాకు కంఫర్ట్ గా లేదు కాబట్టి నేను వేసుకోను.. పదహారేళ్ళ వయసులో చున్నీ వేసుకొని మా అమ్మతో కలిసి నడుస్తున్నప్పుడు కూడా చూసేవాళ్ళ చూపులు ఆగలేదు కదా.. 21 సంవత్సరాల వయసులో సాక్షాత్ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల లో తలనీలాలు ఇస్తున్న ఎందరో నికృష్టులు నా వైపు చూశారు. కానీ ఇప్పుడు నేను వేసుకున్నా…వేసుకోకపోయినా నా దగ్గర వెధవ వేషాలు వేయడానికి ఎవరు సాహసించరు. అప్పుడు లేనిది ఇప్పుడు నా దగ్గర ఉన్నది నా ధైర్యం..”అని అన్నారు.

representative image

అంతేకాదు సంప్రదాయం పేరుతో వస్త్రధారణ అని ఆడవారికి నియమాలు పెట్టడం వల్ల ఉపయోగం కలుగదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వారికి అందివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మరక్షణ చేసుకునే విధంగా కరాటే వంటి విద్యలను వాళ్లకు చిన్నతనం నుంచే నేర్పించాలి.. అని ఆమె అన్నారు.

Note: all the images used in this article are just for representative purpose. But not the actual characters

Previous article30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే ఎదురయ్యే 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!
Next articleసూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించారా..? ఏ సినిమాలో అంటే..?