బెస్ట్ హీరో మాత్రమే కాదు… బెస్ట్ యాక్టర్ కూడా..! కానీ ఇప్పుడు ఏమైపోయారు..?

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, కష్టపడి పైకి వచ్చిన హీరోల్లో ముందు వరుసలో ఉండే హీరో రవితేజ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టి,  సైడ్ యాక్టర్ గా నటించి, ఇప్పుడు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు.

ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే ఎంతో మంది యంగ్ హీరోలకి ఇన్స్పిరేషన్ అయ్యారు. రవితేజ చేసిన సినిమాల్లో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా సినిమాలు హిట్ కూడా అయ్యాయి. ఎన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినా సరే తర్వాత తన స్టైల్ లో కంబ్యాక్ ఇస్తూ వస్తున్నారు రవితేజ. అయితే రవితేజ పెద్ద హీరో మాత్రమే కాదు. గొప్ప నటుడు కూడా.

కానీ ఆ నటుడు అయిన రవితేజని చూసి చాలా సంవత్సరాలు అయ్యింది. రవితేజ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ మరొక పక్క కమర్షియల్ సినిమాలు కూడా చేస్తున్నారు. రావణాసుర సినిమా కాన్సెప్ట్ పరంగా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి సేమ్ రాబిన్ హుడ్ టెంప్లేట్ ఫార్ములా వాడి హీరో తప్పుడు పనులు చేసినా దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది అన్నట్టు చూపించారు.

Ads

ఇటీవల వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమా అయితే భారీ అంచనాల మధ్య విడుదల అయ్యి నిరాశపరిచింది. అందులో కూడా అనవసరమైన లవ్ ట్రాక్ వంటివి పెట్టారు. అవి ప్రేక్షకులకి నచ్చడం, నచ్చకపోవడం అనే విషయాన్ని పక్కన పెడితే కొన్ని సీన్స్ అయితే చాలా ఇబ్బందికరంగా అనిపించాయి. దాంతో అభిమానులు మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చాలా మంది రవితేజ స్క్రిప్ట్ సెలక్షన్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రవితేజ చాలా టాలెంట్ ఉన్న నటుడు. కమర్షియల్ సినిమా అనే ఒక సర్కిల్ లో ఇరుక్కుపోయారు ఏమో అనిపిస్తుంది. నేనింతే సినిమా కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా పరాజయం పొందినా కూడా రవితేజ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈగల్ సినిమా కూడా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుంది అనే అనుకుంటున్నారు.

కానీ ట్రైలర్, పాటలు చూస్తున్నంత సేపు, ఇది కూడా హీరో కొంత మంది ప్రజలని సేవ్ చేయడం, హీరో పక్కన ఒక హీరోయిన్ ఇదే ఫార్ములాతో నడుస్తోంది అన్నట్టు అనిపిస్తోంది. రవితేజ ప్రతి సినిమాకి తన 100% కృషి చేస్తున్నారు. కానీ ఏ సినిమా కూడా రవితేజలోని నటనని బయటకు తీసుకురావడం లేదు. ఒక నేనింతే. ఒక ఖడ్గం. అసలు ఇలాంటి యాక్టర్ రవితేజని మళ్ళీ ఎప్పుడు చూస్తాము అని అందరూ అనుకుంటున్నారు. ఏదేమైనా సరే రవితేజ లోని నటుడిని చూపించే సినిమా మళ్లీ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

Previous articleరామ మందిరం ఎఫెక్ట్ వల్ల… అయోధ్యలో పెరిగిపోయిన భూముల ధరలు..! ఎంత ఉన్నాయో చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleఎన్టీఆర్ “దేవర” వీడియోలో ఈ 2 విషయాలు మైనస్ అయ్యాయా..? ఆ ఫ్లాప్ సినిమా గుర్తొచ్చింది ఏంటి..?