Ads
చాలా మందికి వివిధ రకాల సందేహాలు తలెత్తుతూ ఉంటాయి. పిల్లి ఎదురొచ్చినా బల్లి పడినా సాధారణంగా ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అలానే ఉడుత కూడా ఇంటికి వస్తే మంచిదా కాదా…? ఇది అరిష్టమా అని చాలా మంది అడుగుతూ ఉంటారు మరి ఉడుతకి సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు ఇప్పుడే తెలుసుకుందాం.
ఉడుతని లక్ష్మీదేవి చిహ్నం గా భావిస్తూ ఉంటారు. నిజానికి ఉడుత ఇంటికి సంపద శ్రేయస్సును తీసుకువస్తుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం చూస్తే ఉడుత ని శ్రీరాముని సహచరిగా భావిస్తారు. ఎవరైనా వ్యక్తి ఉడుతని చూసినా ఉడుతని తాకినా అది అదృష్టం అని అంటారు. పైగా ఉడుత మనకి కొన్ని సంకేతాలని ఇస్తుందని కూడా చెప్తూ ఉంటారు.
ఇలా కనుక జరిగితే అది శుభమే:
Ads
- ఉడత కనుక మీ పెరట్లో కనబడితే అది ఎంతో శుభం. త్వరలో మీకు శుభవార్త అందుతుందని దానికి అర్థం.
- మన ఇంట్లోకి వచ్చి ఉడుత అటు ఇటు తిరుగుతూ ఉంటే దానిని మంగళంగా భావిస్తారు. ఉడుత ఇంట్లోకి వస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందట.
- ఒకవేళ కనుక ఉడుత మీకు కనబడితే దానిని లక్ష్మీ అని పిలవాలి అలా కనుక పిలిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు కలుగుతాయి.
- ఉడుత వచ్చిందంటే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్లే అని తెలుసుకోండి. మీ ఇంటి ముఖద్వారం దగ్గర మీకు ఉడుత కనక కనపడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తోందని దానికి అర్థం.
- అదే మీ వంట గదిలో ఉడత కనపడిందంటే కొరతల నుండి బయటపడచ్చని దానికి అర్థం.
- ఉదయాన్నే మీరు ఉడుతని చూస్తే రోజంతా కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందట ఒకవేళ కనుక తెల్లవారుజామున ఉడుత కనబడింది అంటే త్వరలో డబ్బు మీ ఇంటికి వస్తుందని దానికి అర్థం. అలానే ఏదో ఒక శుభవార్త మీరు వింటారు.
- ఉడుత కనక మిమ్మల్ని తాకింది అంటే మీ చుట్టూ ఉండే ప్రతికూల శక్తి పోయిందని దానికి సంకేతం.
ఇలా కనుక జరిగితే అది అశుభం:
మీ పెరట్లో కాని మీ ఇంట్లో కాని అది చనిపోయిందంటే అది అశుభంగా భావించాలి. కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యలు కలుగవచ్చని భావించాలి. ఎప్పుడూ కూడా ఉడుతని కొట్టకూడదు బాధ పెట్టకూడదు.