Ads
వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్లో టీమిండియా తన విజయ పరంపర కొనసాగిస్తుంది. స్థిరంగా ఫీల్డ్ లో నిలబడమే కాకుండా మ్యాచ్లలో అజేయమైన కార్డును నెలకొల్పుతోంది..నవంబర్ 15న ముంబై వాంఖడే స్టేడియంలో జరగబోయే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ తో తలపడనుంది. న్యూజిలాండ్ ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో ఆడిన 9 మ్యాచ్లలో ఐదింటిలో విజయం సాధించి పాయింట్స్ పరంగా నాలుగవ స్థానంలో ఉంది. అందుకే జరగబోయే సెమీఫైనల్స్ మ్యాచ్ లో టీం ఇండియా పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Ads
ఈ నేపథ్యంలో భారత్ ,న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ తొలి సెమీఫైనల్ మ్యాచ్ గురించి పలు రకాల సందేహాలు వినిపిస్తున్నాయి. రేపు జరగబోయే మ్యాచ్ కి వాన వల్ల అంతరాయం కరిగే అవకాశం ఉండడం వల్ల.. ఫలితం ఎలా ఉంటుంది అన్న సందేహం కూడా చాలామందికి కలుగుతుంది. ఒకవేళ రేపు మ్యాచ్ కి వాన వల్ల అంతరాయం కలిగితే ఏం జరుగుతుందో తెలుసా?
సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ ల కోసం షెడ్యూల్ చేయబడిన రోజుతో పాటుగా అసంపూర్తిగా ఉన్నటువంటి మ్యాచులను ముగించడం కోసం ఒక రిసర్వ్ డే ఇవ్వడం జరుగుతుంది. రిజర్వ్డ్ తర్వాత కూడా మ్యాచ్ ఫినిష్ కాకపోయినట్లయితే.. లీగ్ దశలో ఏ జట్టు ముందంజలో ఉందో ఆ జట్టు క్వాలిఫై అవుతుంది. ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్ టై అయినట్లయితే.. సూపర్ ఓవర్ ఫైనల్ కి ఏ జట్టు వెళ్తుంది అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. అయితే టీమ్ ఇండియాను గత కొద్ది కాలంగా సెమీఫైనల్స్ గండం వెంటాడుతూనే ఉంది.. మరి ఈసారైనా ఆ గండం గట్టెక్కుతుందేమో చూడాలి.