Ads
ఏదైనా ఆస్తి మనది అని చెప్పడానికి మన దగ్గర పత్రాలు కచ్చితంగా ఉండాలి. పత్రాలు లేకుండా మనం అది మనది అని చెప్పిన ఎవరు నమ్మరు. పైగా అది చెల్లదు. పొలం కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ ఇలా మనం ఏం కొన్నా సరే దస్తావేజులు కీలకం. అవి లేకపోతే కుదరదు. అందుకనే ప్రతి ఒక్కరూ విలువైన పత్రాలని ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తారు. అయితే ఒక్కొక్క సారి వాటిని చాలా మంది పోగొట్టుకుంటూ ఉంటారు.
ఒకవేళ కనుక ఆస్తి పత్రాలు కనబడకపోతే ఏం చేయాలి..? ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు. ఆస్తి పత్రాలు పోగొట్టుకుంటే ఏం చేయాలో ఇప్పుడే చూసేద్దాం.
ఎప్పుడైనా సరే ఆస్తి పత్రాలు పోయాయి అంటే ఇలా చేయండి:
Ads
- యజమాన్య పత్రాలని టైటిల్ డీడ్ అని కూడా అంటారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక లేవంటే ఆస్తిపై హక్కులు నిరూపించుకోవడం చాలా కష్టం. ఒకవేళ కనుక ఆస్తి కి సంబంధించిన పత్రాలు కనబడకపోతే డూప్లికేట్ ని పొందాలి.
- ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవంటే డూప్లికే డాక్యుమెంట్స్ ని పొందొచ్చు. దీనికోసం మీరు కొన్ని రూల్స్ ని ఫాలో అవ్వాలి.
- ఎవరైనా మీ పత్రాలను తొలగించినా లేదంటే అవి పోయినా స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి మీరు మొదట కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత మీరు ఎఫ్ఐఆర్ లేదా ఎన్సీఆర్ ను ఫైల్ చెయ్యండి. ఈ ఫిర్యాదుకు సంబంధించిన కాపీని మీరే ఉంచుకోవాలి.
- 15 రోజుల నోటిసు వ్యవధి అయ్యాక సబ్-రిజిస్ట్రా కార్యాలయంకి మీరు ఈ కేసు కి సంబంధించి వివరాల తో వెళ్ళాలి.
- ఈ సమయం లోనే మీరు డూప్లికేట్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చెయ్యండి.
- వారం లేదా పది రోజుల్లో డూప్లికేట్ సేల్ డీడ్ మీ చేతికి వస్తుంది. వీటి పైన సబ్ రిజిస్ట్రార్ ఆమోదం కలిగిన స్టాంప్ కూడా ఉంటుంది.