Ads
బోర్ కొడుతున్నప్పుడు మనకి మొదటి గుర్తొచ్చేది సినిమా. చాలా మంది బోర్ కొట్టినప్పుడు టీవీ ని చూస్తూ ఉంటారు. టీవీ లో వచ్చే ప్రోగ్రామ్స్ ని కానీ సినిమాలను కానీ చూస్తూ ఉంటారు. మీరు కూడా ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటారా..? అయితే టీవీ చానల్స్ ఇచ్చే ప్రోగ్రామ్స్ కానీ మూవీస్ కానీ వాళ్ల టీఆర్ఫీ కోసమే. ఈ మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు. అయితే టీవీ చానల్స్ వాళ్ళు ఎందుకు టీఆర్పీ మీద దృష్టి పెడతారు..? అసలు టీఆర్పీ అంటే ఏమిటి మరి దానికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
టీఆర్ఫీ అంటే టెలివిజన్ రేటింగ్ పాయింట్. దీనిని బట్టి ఏ ఛానల్ ని ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు ఏ ప్రోగ్రాం ని ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు అనేది తెలుస్తుంది.
Ads
టీఆర్పీ ద్వారా టీవీ ఛానల్ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అయితే ఎక్కువ టీఆర్ఫీ రావడం వలన కలిగే బెనిఫిట్ ఏమిటి..? తక్కువ టీఆర్పీ ఉంటే ఏమవుతుంది అనేది కూడా చూద్దాం. ఏదైనా యాడ్ టీవీ లో డిస్ప్లే అవ్వాలంటే ఆ ఛానల్ కి టీఆర్ఫీ రేటింగ్ ఎంత ఉంది అనేది చూసి చానల్ కి అడ్వర్టైజ్మెంట్లని ఇస్తూ ఉంటారు. దీని వలన ఛానల్స్ కి యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్ల వల్ల డబ్బులు వస్తాయి. సో ఎప్పుడైనా సరే యాడ్స్ ఇవ్వాలంటే టీఆర్పీని చూస్తారు టీఆర్పీ ఎక్కువ ఉంటే యాడ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ఇలా యాడ్ ల ద్వారా టీవీ ఛానల్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇక ఈ టీఆర్ఫీ ని ఎలా కౌంట్ చేస్తారు అనేది కూడా చూద్దాం. బిఏఆర్ సీ బ్రాడ్కాస్టింగ్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా దీన్ని లెక్కపెడుతుంది. కొన్ని వేల ఇళ్లలో టీవీల్లో వీళ్ళ పరికరం వుంటుంది. ఛానల్ లో వచ్చే సౌండ్ బట్టీ తెలుసుకుంటారు. అన్ని టీవీల్లో పెట్టాలంటే ధర ఎక్కువ అవుతుంది కనుక శాంపిల్ కోసం కొన్ని టీవీల్లోనే పెడతారు.