Ads
ప్రస్తుతం ఎవరు ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలనుకున్నవారికి ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్. అందరూ ఏ విషయం అయినా సరే గూగుల్ తల్లినే అడుగుతున్నారు.
Ads
ఇక పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు అందరు తమ సందేహాలను తీర్చుకునేందుకు గూగుల్‌నే ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. అయితే ఈమధ్య గూగుల్ సెర్చింగ్ పై జరిగిన ఒక సర్వేలో సంచల విషయాలు బయటకు వచ్చాయి. ఇక అదేంటి అంటే కొత్తగా పెళ్లైన అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో ఎలాంటి విషయాల గురించి కోసం వెతుకుతున్నారు. అయితే ఆ వివరాలలోకి వెళ్తే, గూగుల్ డేటాను బట్టి పెళ్లైన అమ్మాయిలు వారి భర్తకు ఏం ఇష్టమో ఎలా తెలుసుకోవాలనేదాని గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారంట.
ఇక భర్తకు కావల్సిన వాటి గురించి, మరియు భర్త ఇష్టపడే వాటి కోసం, ఇష్టపడనివి ఏంటి అనే వాటిని తెలుసుకోవాలని మహిళలు వెతుకున్నారంట. ఇక పెళ్లైన అమ్మాయిలు భర్త ప్రేమను ఎలా గెలుచుకోవాలని, వాళ్లను ఎలా ఆనందంగా ఉంచాలనే ప్రశ్నను చాలా సార్లు గూగుల్లో అనేక సార్లు సెర్చ్ చేసినట్టుగా తెలిసింది. అలాగే పెళ్లైన మహిళలు తమ భర్తను ఎలా గుప్పిట్లో పెట్టు కోవాలి? దానికోసం ఏం చేయాలని కూడా గూగుల్ లో వెతికినట్లుగా అధ్యయనంలో తెలిసింది.
అంతేకాకుండా పెళ్లైన అమ్మాయిలు బిడ్డను కనడానికి సరి అయిన టైమ్ ఎప్పుడు అని గూగుల్ లో సెర్చ్ చేసినట్లుగా తెలిసింది. కొత్తగా పెళ్లైన అమ్మాయిలు అత్తగారింట్లో ఎలా మెలగాలి? ఆ ఫ్యామిలిలో ఎలా ఉండాలని, అలాగే అత్తగారితో ఎలా ఉండాలని కూడా గూగుల్ లో వెతుకుతున్నట్లు తెలిసింది. ఇంకా ఫ్యామిలీ బాధ్యతలను ఎలా చూసుకోవాలని, పెళ్లి అయిన తరువాత సొంతంగా బిజినెస్ ఎలా కొన సాగించాలని? ఫ్యామిలీ బిజినెస్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయం తెలుసుకోవడానికి గూగుల్ లోనే వెతుకుతున్నట్లుగా ఆ సర్వే వెల్లడించింది.
Also Read: అమెజాన్ ప్రైమ్ లో ‘పుష్ప’ సినిమాతో పాటు అత్యధిక వ్యూయర్ షిప్ ను సాధించిన 10 సినిమాలు..