Ads
పెళ్లయిన తర్వాత భర్తకు సంబంధించిన ప్రతిదీ తమకే చెందుతుంది అని భార్యలు అనుకుంటారు. కానీ నిజానికి భర్త ఆస్తిలో భార్యలకు ఎంతవరకు హక్కు ఉందో తెలుసుకుందాం. భర్త స్వతహాగా సంపాదించిన ఆస్తి మీద అతని తల్లికి భార్యకు పిల్లలకు సమానమైన హక్కు ఉంటుంది. భార్యాభర్తలు విడిపోతే భర్త ఆస్తి మీద స్త్రీకి ఎంతవరకు, ఎలాంటి హక్కు ఉంటుందో తెలుసుకుందాం.
ఒకవేళ భార్యాభర్త విడిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ తర్వాత భర్త ఆస్తి అతని తల్లి ,భార్య, పిల్లలకు ఇవ్వాలి. భర్త ఎవరికైనా వీలునామా రాసిచ్చి ఉంటే ఆస్తి ఆ నామినికి వస్తుంది. అలా వీలునామా రాయకుండా భర్త చనిపోవడం జరిగితే మాత్రం అతని ఆస్తిని తల్లి, భార్య ,పిల్లలు సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది.
Ads
భర్త దగ్గర ఉన్న ఆస్తి అతని స్వార్జీతం కాకుండా వారసత్వంగా వచ్చిన ఆస్తి అయితే మాత్రం దానిపై భార్యకు ఎటువంటి హక్కు ఉండదు. ఆమెకు సంతానం ఉంటే ఆస్తికి ఆమె బిడ్డ వారసుడు అవుతాడు. భర్త ఆస్తి మీద పూర్తి హక్కు బిడ్డకు మాత్రమే ఉంటుంది. ఇక భరణం విషయానికి వస్తే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే కానీ భరణం రాదు.
ఆస్తుల విషయాల్లో ఎటువంటి తగాదాలు రాకుండా ఉండాలి అంటే ముందు నుంచే మీ హక్కుల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలి అంటే మీరు ఒక మంచి వకీలను సంప్రదించాల్సి ఉంటుంది.