Ads
ఈ మధ్య కాలంలో చక్కెర తీసుకునే వారి సంఖ్య పెరిగింది. చక్కెరను టీ, కాఫీ, స్వీట్స్ రూపంలో ఎక్కువగానే తీసుకుంటున్నారు. అయితే అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.
దీనివల్ల మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి వ్యాధులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే నెలరోజులు పంచదారను పక్కన పెట్టగలిగితే, శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ప్రముఖ డైటీషియన్ అంకితా ఘోషల్ బిష్త్ వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మనం టీ, కాఫీలతో ప్రారంభించి మిఠాయిలు, స్వీట్ల వరకు ఎక్కువగా పంచదారను వాడుతుంటాము. చక్కర వాడకం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దీనివల్ల కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, మధుమేహం, లాంటివి రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పంచదారను నెలరోజుల పాటు ఉపయోగించకుండా ఉంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో, అది ఎలా శరీఆరం పైన ప్రభావం చూపిస్తుందో డైటీషియన్ అంకితా ఘోషల్ బిష్త్ చెబుతున్నారు. పంచదార తీసుకోవడం నివారించడం వల్ల కేలరీల తగ్గుతాయి. దీనివల్ల అదనపు శరీర బరువు తగడంలో సాయం చేస్తుంది. చక్కెరను తీసుకోకపోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడుతున్నవారు అయితే చక్కెరను తీసుకోకపోవడం చాలా మంచింది. పంచదారతో చేసిన పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల కొన్ని సమయాలలో అతిగా తినడం వంటివి చేస్తారు. చక్కెరను తీసుకోవడం మానేయడం వల్ల అతిగా తినడం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
దంత క్షయానికి కారణం అయ్యేవాటిలో చక్కెర కూడా ఒకటి. అందువల్ల స్వీట్లకు దూరంగా ఉంటే దంతాల ఆరోగ్యం పెరుగుతుంది. చక్కెర లేదా చక్కెరతో చేసిన పదార్ధాలు తినడం వల్ల చర్మం కాంతిని కోల్పోతుంది. చాలా మంది పంచదార తినడం మానేసిన తర్వాత వారి స్కిన్ కాంతిలో పెరుగుదలను గమనించారని తెలిపారు. అలాగే మొటిమలు కూడా తగ్గుతాయి. ఎనర్జీని పెంచుతుంది. అందువల్ల చక్కెర వినియోగాన్ని మానేస్తే, రోజంతా కూడా శరీరానికి ఎనర్జీ ఉంటుంది. దాంతో అలసట తగ్గుతుందని వెల్లడించారు.
Ads
Also Read: రాళ్ల ఉప్పుకి మాములు ఉప్పుకి ఉన్న తేడా ఏమిటో తెలుసా..? ఏ ఉప్పు వాడాలంటే..?