Ads
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రబాబుని, కోర్టులో హాజరు పరచడం, ఆ తరువాత రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్లడం తెలిసిందే.
ఇతర పార్టీల నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు సైతం చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు అరెస్ట్ పై స్పందించలేదు. దాంతో అసలు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ? ఏం చేస్తున్నారు అని చర్చించుకుంటున్నారు. ఏపీ స్కిల్ డెవలెప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో టీడీపీ పార్టీలో, ఏపీలో ఆందోళనకు దారి తీసింది. చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోడ్డుపై నిరసన తెలిపారు. టీడీపీ నాయకులు, నందమూరి కుటుంబం చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. తాజాగా ప్రెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ అధికార పక్షానికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అరెస్ట్ కు నిరసనగా బంద్ కు పిలుపునిచ్చారు. ఇతర పార్టీలు కూడా సంఘీభావం తెలిపాయి.
ఇంత జరుగుతున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం స్పందించడం లేదు. దాంతో టిడిపిలో ఒక వర్గం ఎన్టీఆర్ పై మండిపడుతున్నారు. ఎన్టీఆర్ గానీ, నందమూరి కళ్యాణ్ రామ్ గానీ ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మీద రెస్పాండ్ కాలేదు. అరెస్ట్ ను ఖండించలేదు. అయితే నారా రోహిత్, చైతన్య కృష్ణ వంటి వారు వరుసగా అరెస్ట్ ను ఖండిస్తూ పోస్టులు చేస్తున్నారు.
ఎన్టీఆర్ సైలెంట్ గా ఉండటంతో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ మరియు చంద్రబాబు పై కోపంగా ఉన్నాడని, అందుకే దూరంగా ఉంటున్నట్టు కనిపిస్తోందని సామాజిక మధ్యమాలలో చర్చలు జరుగుతున్నాయి. యంగ్ టైగర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ షూటింగ్ బిజీగా ఉన్నాడని సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో నటిస్తున్నాడు.
Ads
Also Read: రెండేళ్ళ పాటు అలిగి…తండ్రిపై మౌన పోరాటం చేసిన హరికృష్ణ…ఎందుకో తెలుసా.?