Ads
లోక నాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా జూన్ 3వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ గా అయిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు సంవత్సరాలు ఒక్క హిట్ లేకుండా ఉన్న కమల్ హాసన్ కు ఈ సినిమా విజయానందాన్ని అందించింది.
Ads
ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలలోనే రూ. 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి డైరక్టర్ లోకేశ్ కనగరాజు. ఇక ఈ మూవీలో పనిమనిషి క్యారెక్టర్ చేసిన నటి గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఈ సినిమాలో కమల్ హాసన్ హీరో కొడుకు విలన్ చేతిలో మరణిస్తాడు. అప్పటి నుండి ఆయన కోడలికి, మనవడికి ఒక పనిమనిషిని తోడుగా ఉంచుతాడు.విక్రమ్ కుటుంబం పై పగ తీర్చుకోవడానికి విలన్ అనుచరులు ఆయన ఇంట్లో ఉండని సమయంలో వస్తారు. అప్పుడు ఆయన కోడలితో పని మనిషి విక్రమ్ కు కాల్ చేయమని ఎంతగా చెప్పినా కూడా, మామపై మంచి అభిప్రాయం లేని కోడలు పని మనిషి మాటలు అస్సలు వినిపించుకోదు. దాంతో ఆ పని మనిషి విలన్ అనూచరుల పై ఒక్కసారిగా విరుచుకపడుతుంది.అప్పుడు ఆ పని మనిషే ఏజెంట్ టీనా అని, విక్రమ్ ఆ ఇంటి రక్షణ కోసం ఆమెను పనిమనిషిగా అక్కడ ఉంచాడనే విషయాన్ని డైరెక్టర్ రివీల్ చేస్తాడు. ఇక ఈ మూవీలో యాక్షన్ సీన్స్ లో హైలెట్ అయిన వాటిలో ఇది ఒకటి. ఆమె పేరు వాసంతి. కోలివుడ్ లో కొరియోగ్రాఫర్. ఇక ఆమె నటిగా తెరపై తొలిసారి ఈ మూవీలోనే కనిపించింది. వాసంతి ఈ మూవీతో తనకి ఇంత గుర్తింపు రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. అందరు తనని ఏజెంట్ టీనా అని పిలుస్తున్నారని, తనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి వాసంతి ధన్యవాదాలు తెలిపింది.
Also Read: ‘కాంతార’ మూవీలో ఉన్న ఈ మిస్టేక్ ఏమిటో తెలుసా?