“దిల్ రాజు” లాగే “తమిళ్” లో సినిమా చేసి… హిట్ అందుకున్న తెలుగు నిర్మాతలు వీరే.!

Ads

గత కొన్ని సంవత్సరాలలో సినిమా విషయంలో ప్రాంతాల మరియు భాషల మధ్య హద్దులు తొలగిపోయాయి. పాన్ ఇండియా, ఓటీటీలు సినిమాలతో అందరు అన్ని భాషల సినిమాలను చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్లు సొంత ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే, ఇతర  ఇండస్ట్రీలలోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక నిర్మాతలు సైతం తమ పరిధిని విస్తరించే పనిలో ఉన్నారు. ఇప్పటికే వెళ్ళినవారు విజయం సాధించగా, కొందరు ప్రయత్నిస్తున్నారు. ఆ నిర్మాతలెవరో ఇప్పుడు చూద్దాం..
1. దిల్ రాజు:

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గత ఏడాది కోలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చారు. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి హీరోగా ‘వారిసు’మూవీని నిర్మించారు.ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, జయసుధ, సంగీత వంటివారు కీలక పాత్రలలో నటించారు.అక్కడ ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.

2. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి:

Ads

తెలుగు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ మినిమమ్ బడ్జెట్ చిత్రాలతో పాటుగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తోంది.పుష్ప 2 మూవీని ఈ సంస్థ పాన్ ఇండియా లెవల్ లో నిర్మిస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ, ప్రభాస్, హను రాఘవపూడి కాంబో మూవీని కూడా నిర్మించబోతుంది. ఇతర సినీ ఇండస్ట్రీలలోకి కూడా అడుగుపెట్టబోతుంది. మలయాళంలోఇప్పటికే టొవినో థామస్ తో పాన్ ఇండియా సినిమాకి నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. రీసెంట్ గా చెన్నైలో సైతం ప్రొడక్షన్ ఆఫీస్ ని ఓపెన్ చేసారని తెలుస్తోంది.
3. T G విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల:

ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రీసెంట్ గా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. సంతానం హీరోగా వడక్కుపట్టి రామసామి అనే చిన్న సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని కార్తీక్ యోగి తెరకెక్కించాడు.ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా క్రమంగా పెరుగుతూ ఈ మూవీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది.పీపుల్స్ మీడియా సంస్థకు కోలీవుడ్ లో తొలి ప్రయత్నంలోనే మంచి విజయం దక్కింది.
Also Read: ఈ వ్యక్తి చాలా ఫేమస్… ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు..! ఎవరో తెలుసా..?

Previous articleSUCCESS STORY: ముగ్గురు ఆడపిల్లలు పుట్టడంతో తండ్రి వదిలేసాడు…కానీ ఆ ముగ్గురు ఇప్పుడు ఎంతోమంది ఆదర్శం.!
Next articleత్రిశూలానికి బదులుగా ఈ శివాలయంలో ఎందుకు పంచశూలాన్ని పెట్టారు..? ఈ ఆలయం రహస్యం ఇదే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.