Ads
ఐపీఎల్ మ్యాచ్లు అవుతున్నప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడే ప్రతి మ్యాచ్ కి కూడా కావ్య మారన్ వస్తూ వుంటారు. ఈమె సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేస్తుంటారు. అయితే ఆమె ఎవరు..?, ఎందుకు అన్ని మ్యాచ్ల కి వస్తారు..? అనే విషయాలని చూద్దాం.
సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కూతురు ఈమె. సన్ మ్యూజిక్ తో పాటు సన్ టీవీ యొక్క ఇతర ఎఫ్ ఎం చానల్స్ వర్క్ ప్రాసెస్ కి కూడా ఈమె వెళుతూ వుంటారు.
క్రికెట్ అంటే ఈమె కి ఎంతో ఇష్టం. సన్ గ్రూప్ కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కావ్య తల్లి కావేరీ మారన్. కావ్య భారతదేశంలో హైయెస్ట్ పెయిడ్ బిజినెస్ ఉమెన్. 2018 లో ఈమె మొదట హైదరాబాద్ జట్టు ని సపోర్ట్ చేయడానికి వచ్చి అందరి దృష్టి లో పడ్డారు.
కావ్య జననం, విద్యాబ్యాసం, కుటుంబ వివరాలు:
కావ్య 6 ఆగస్టు, 1992 లో చెన్నైలో పుట్టారు. కావ్య తండ్రి వీడియో న్యూస్ మ్యాగజిన్ ద్వారా ఆయన కెరీర్ ని మొదలుపెట్టారు. క్రమంగా ఆయన హైయెస్ట్ పెయిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. ఆ తర్వాత సన్ నెట్వర్క్ ని స్టార్ట్ చేశారు.
Ads
కావ్య తాతగారు మొరసోలే మారన్ మాజీ యూనియన్ మినిస్టర్ ఈయన ద్రావిడ మునిత్రా కజగం పార్టీ కి చెందిన వ్యక్తి. కావ్య స్టెల్లా మేరీస్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఈమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని లియోనార్డ్ N స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ న్యూయార్క్ యూనివర్సిటీలో పూర్తి చేశారు.
కావ్య అభిరుచి:
కావ్య కి ఏవియేషన్ & మీడియా రంగాల మీద ఆసక్తి ఎక్కువ వుంది. అలానే ఈమె కి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. అలానే మ్యూజిక్ వినడం కూడా కావ్య కి ఇష్టం. అలానే ఈమె కి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ వుంటారు. SUN మ్యూజిక్ & FM ఛానెల్ల కి సంబంధించి పనులని చూసుకుంటున్నారు ఇప్పుడు. అంతే కాక ఈమె ఐపీఎల్ 2021 వేలం సమయంలో కూడా ఎక్కువ కనిపించింది. ఆటగాళ్ల బిడ్డింగ్ లో కూడా యాక్టీవ్ గా వుంది ఈమె.