గుర్తుపట్టలేనట్టుగా మారిపోయిన ఈ హీరో ఎవరో తెలుసా..? ఇటీవలే సూపర్ హిట్ కొట్టారు..!

Ads

డాక్టర్ బిజు దామోదరన్ డైరెక్షన్ లో టోవినో థామస్ లీడ్ రోల్ లో తెరకెక్కిన అదృశ్య జలకంగల్ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక యాంటీ వార్ మూవీ. ఇది డిసెంబర్ 8 నుండి ఓటిటిలో ప్రసారం కి రెడీ అయింది. ఈ చిత్రం నవంబర్ 24 న థియేటర్లలో విడుదల అయింది.

విడుదలైన రెండు వారాలలోపే స్ట్రీమింగ్ కి వచ్చేసింది.టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించడానికి ఎంపిక చేయబడిన మొదటి మలయాళం మూవీ ఇదే కావడం గమనార్హం.

who is this hero

టోవినో.. తన వైవిధ్యమైన నటనతో గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టే సినిమాలు చేస్తున్నాడు. యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న టోవీనో.. ఈ అదృశ్య జలకంగల్ మూవీలో తన నటనతో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ మూవీలో అతను తన కెరియర్ లోనే అత్యుత్తమమైన ప్రదర్శన కనబరిచినట్లు గుర్తించవచ్చు. ఒక యాక్టర్ కి తన నటన పట్ల ఉన్న డెడికేషన్ ని మనం ఈ మూవీలో టోవినో క్యారెక్టర్ లో చూడవచ్చు.

Ads

who is this hero

ఈ మూవీలో ఎటువంటి పేరు లేని ఒక పాత్రలో నటించిన టోవినో.. క్యారెక్టర్ కి సెట్ అవ్వడం కోసం విపరీతంగా బరువు తగ్గడమే కాక తన రూపాన్ని గుర్తుపట్టలేనట్టుగా మార్చుకున్నాడు. సినిమాలో సడన్ గా చూస్తే ఇతను టోవీనో అని చెబితే కానీ ఎవరు గుర్తుపట్టలేనట్టుగా ఉంది అతని వాళ్ళకం. ఇందులో అతని నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చాలా సహజంగా ,గుండెకు హత్తుకుపోయే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ లో కూడా అదరగొట్టే పర్ఫామెన్స్ తో దూసుకుపోతోంది.

Previous article“బాలయ్య”తో నటించడానికి మూడు సార్లు “నో” చెప్పిన హీరోయిన్…15 ఏళ్ల క్రితం కలిసి నటించారు కానీ.?
Next articleతెల్లవారుజామున 3 గంటలకే మెలుకువ వస్తోందా.? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.