Ads
సీనియర్ హీరోయిన్, అక్కినేని నాగార్జున భార్య అమల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అమల కోలీవుడ్ చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు మరియు మలయాళ సినిమాలలో నటించి తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అమల నాగార్జున హీరోగా నటించిన చినబాబు మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఆ చిత్రం తర్వాత నాగార్జున, అమల రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘శివ’ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ సమయంలోనే నాగార్జున, అమల ప్రేమలో పడ్డారట. పెద్దల అంగీకారంతో 1992లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అమల తన కెరీర్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే నాగార్జునను వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తరువాత ఆమె నటనకు దూరం అయ్యారు. అయితే వేలకోట్లకు ఆస్తులకు వారసురాలు అయిన అమలకు బంగారం ధరించే అదృష్టం లేదంట. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
ఆమె తల్లిదండ్రులు ముఖర్జీ, జెన్నీఫర్. చెన్నై కళాక్షేత్రలో అమల బి.ఏ ఫైన్ ఆర్ట్స్ చేసారు. ఆమెకు క్లాసికల్ డాన్స్ అంటే ఆసక్తి ఉండడంతో చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు. అక్కినేని అమల ఇటీవల శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం సినిమాలో నటించింది. మూగజీవాల మీద ఉన్న ప్రేమతో బ్లూక్రాస్ సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయితే అమల ఎప్పుడూ సింపుల్ గా ఉంటారు. అమల బంగారం ధరించినట్టు కూడా కనిపించదు. ఆమె మెడలో ఎప్పుడు నల్లపూసలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే చెవులకు పోగులు, చేతికి గాజుల లాంటివి పెట్టుకోరు. అయితే బంగారం ఇష్టం లేక మాత్రం కాదంట. బంగారు నగలు వేసుకున్నప్పుడు చర్మానికి సంబంధించిన సమస్యలతో బాధపడినట్టు తెలుస్తోంది. అందువల్లే అమల ఎలాంటి బంగారు ఆభరణాలు ధరించరని సమాచారం.