Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా డిస్కౌంట్ సేల్స్ జరుగుతున్నాయి.. కానీ చాలామంది ఫేవరెట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రం యాపిల్ ప్రొడక్ట్స్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. స్మార్ట్ ఫోన్లో మంచి లగ్జరీ బ్రాండ్ ఏది అంటే కళ్ళు మూసుకొని ఎవరైనా చెప్పే పేరు యాపిల్. ఇతర కంపెనీలతో పోల్చుకుంటే యాపిల్ బ్రాండ్ ఐఫోన్ లో ఉపయోగించే టెక్నాలజీ ,డిజైన్ ,అందించే ఫీచర్స్ ఎంతో ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అందుకే ఖరీదు ఎక్కువైనా సరే చాలామంది వీటిని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు.
మరి కొంతమంది ఐఫోన్ వాడుతున్నాం అని చెప్పుకోవడం కోసం అవసరం లేకపోయినా ఈ ఫోన్లు ఉపయోగిస్తారు. మరోపక్క యాపిల్ కూడా యూజర్స్ ను ఆకట్టుకోవడం కోసం ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో కొత్త అడ్వాన్స్డ్ ఫోన్స్ విడుదల చేస్తూ ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం ఇలా కొత్త ఐఫోన్ విడుదల చేయాల్సిన అవసరం ఉందా అన్న అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా…ఈ ప్రశ్నకు యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు.
Ads
అసలు ఐఫోన్ ఇలా సంవత్సరానికి ఒక కొత్త మోడల్ రిలీజ్ చేయడానికి వెనుక అసలు రీసన్ వాడే యూజర్లు. ప్రతి సంవత్సరం యూజర్స్ కొత్త మోడల్ ని ఉపయోగించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి వారి కోసమే సరికొత్త ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తున్నాం అని టిమ్ కుక్ తెలిపారు .
అలాగే కొత్త ఫోన్ కొనుగోలు చేసే యూజర్లు ట్రేడ్ ఇన్ అవకాశం …అదేనండి పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొనుక్కోవడం పై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు.ట్రేడ్ ఇన్ ద్వారా మేం కలెక్ట్ చేసిన పాత ఐఫోన్లలో పనిచేసే వాటిని తిరిగి అమ్మకానికి పెట్టడం జరుగుతుంది. ఇలా ఎక్కువ డబ్బు పెట్టి ఫస్ట్ హ్యాండ్ ఫోన్స్ కొనుక్కోలేనివారు వీటిని ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒకవేళ మా దగ్గరికి వచ్చిన ఫోన్స్ పనిచేయనివి అయితే అందులో పని చేసే భాగాల వరకు వేరు చేసి మిగిలిన వాటిని మా కంపెనీ రూల్స్ ప్రకారం తుక్కుగా మారుస్తాం అని తెలిపారు.
ఇది ఇలా ఉంటె… 14 ఏళ్ల నుండి కొత్త ఐఫోన్ స్పెషలిటీ ఇదే అంటూ…ఒకటే మాట చెప్తున్నారుగా అంటూ ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఆ వీడియో చూడండి.
watch video: