Ads
ఈజీగా మనం ఆటో లో ట్రావెల్ చెయ్యచ్చు. ఆటో లో ఎక్కడికైనా సరే మనం వెళ్ళచ్చు. పైగా తక్కువ ఖర్చు అవుతుంది. బండి మీద కానీ కారు మీద కానీ మనం వెళితే ఎక్కువ డబ్బులు అవుతుంది. కానీ ఆటో లో అయితే తక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కడకి వెళ్లాలన్న సరే షేర్ ఆటోలు ఉంటాయి. ఈ మధ్యనైతే ఆటోలు మరీ ఎక్కువైపోయాయి. ఏ ఊళ్ళల్లో అయినా సరే ఆటోలు దొరుకుతున్నాయి.
ఇది వరకు అయితే అంత సదుపాయాలు లేవు. అయితే ఎప్పుడైనా దీన్ని మీరు గమనించారా..? కుడి వైపు అంచుకు కూర్చుని ఆటో డ్రైవర్లు డ్రైవ్ చేస్తూ వుంటారు.
ఎందుకు డ్రైవర్లు అలా కుడి వైపు అంచున కూర్చుని డ్రైవ్ చేస్తారు..? ఎపుడైనా ఆలోచించారా..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా డ్రైవర్లు ఆటోని నడుపుతున్నప్పుడు వాళ్ల పక్కన ఒకళ్ళు కూర్చుని ఆటో డ్రైవింగ్ చేయడం నేర్పిస్తూ ఉంటారు. దీంతో వాళ్లకి సైడ్ కి కూర్చుని ఆటోని నడపడమే అలవాటుగా మారుతుంది. ఈ కారణంగా ఆటో డ్రైవర్లు సైడ్ కి కూర్చుని ఆటో ని నడుపుతుంటారు.
Ads
అలానే ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే డ్రైవర్లు సీటు కింద ఉండే ఇంజన్ వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడి కారణంగా వాళ్ళు తరచుగా ఒక పొజిషన్ నుండి ఇంకో పొజిషన్ లోకి మారుస్తూ ఉంటారు. అలానే చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటో లో ఎక్కువ మందిని తీసుకు వెళ్లాలని ఉద్దేశం తో డ్రైవర్ పక్కన కూడా మరొకరిని కూర్చో పెట్టుకుంటూ ఉంటారు. ఎమర్జెన్సీ సమయం లో హారన్ ని కొట్టడానికి మరియు ఆటో ని బ్యాలెన్స్ గా ఉంచడానికి కుడి వైపుని అంచుకి కూర్చోవడం మూలంగా వేగంగా ఆటోని నడపగలరు. బ్యాలెన్స్ చేయగలుగుతారు. కాబట్టి ఆటో లో ఎక్కించుకుంటూ ఉంటారు.