శ్రేయస్ అయ్యర్, చాహల్ భార్య మధ్య సంబంధం ఏంటి.. పదేపదే ఆమెను ఎందుకు చూపిస్తున్నారు?

Ads

వరల్డ్ కప్ 2023 లో ఆటగాళ్లు వారి ఆటతో గేమ్ ని మరింత రసవత్తరంగా మారుస్తుండగా, మరొక వైపు కెమెరామెన్లు నెటిజెన్స్ అభిమానంలో లేనిపోని కొత్త డౌట్లను రేకెత్తిస్తున్నారు. మామూలుగా విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతున్నప్పుడు పదేపదే అనుష్క శర్మను కెమెరాలు జూమ్ చేసి చూపించడం అన్నది చూస్తూ ఉంటాం. ఒక విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతుల మాత్రమే కాకుండా, రోహిత్ ఆడుతున్నప్పుడు రితికను చూపించడం, జడేజా ఆడుతున్నప్పుడు రివాబాను హైలెట్ చేస్తూ చూపించడం లాంటివి చేస్తూ ఉంటారు కెమెరామెన్స్. భర్తలు ఆడుతుంటే భార్యలు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడండంటూ.. వాళ్ల భావోద్వేగాలను కెమెరామెన్ చూపిస్తున్నాడు.

అలాగే గిల్ ఆడుతున్నప్పుడు సారా టెండుల్కర్‌ను చూపించడం గురించి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నప్పుడు భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌ను, అతడి భార్య ధనశ్రీని కెమెరామెన్ చూపిస్తుండటం అందరిని అయోమయానికి గురి ఏడంతో పాటు అనేక రకాల అనుమానాలకు కూడా అది తావిస్తోంది. ఇలా ఎందుకు చూపిస్తున్నాడో కొందరికి అర్థం కావడం లేదు.

Ads

మరికొందరమో ఈ విషయాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు. అయితే గతంలో ధనశ్రీ, అయ్యర్ ఇద్దరూ పార్టీల్లో కనిపించడంతో వారి మధ్య ఏదో ఉందంటూ వార్తలు జోరుగా వినిపించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు శ్రేయస్ అయ్యర్ ఫామ్ కోల్పోయినప్పుడు చాలా మ్యాచ్‌ల్లో తేలిగ్గా వికెట్‌‌ను పారేసుకున్నాడు.

మరొకరి భార్యను ఫ్లర్టింగ్ చేస్తే ఇలాగే అవుతుందని యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్‌ నుంచి అయ్యర్ ఫొటోను పోస్టు చేశారు. అయితే అది పేరడీ అకౌంట్. ఇప్పుడు ఆ ఖాతా కూడా లేదు. అదేవిధంగా ఈ ఏడాది జూన్‌లో ముంబైలో వర్షాలు కురిసే సమయంలో అయ్యర్, ధనశ్రీ ఇద్దరూ ఒకే తరహా ఇన్‌స్టా స్టోరీని షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఏంటి సంగతి అంటూ బోలెడు పోస్టులు కామెంట్లు కూడా చేశారు. ఇలా చాలావరకు వారిద్దరి విషయంలో కొన్ని కొన్ని మ్యాచ్ అవుతుండడంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ప్రతిసారి వీళ్లిద్దరూ హైలైట్ అవుతూ వస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే శ్రేయస్ అయ్యర్ చాహల్ ఇద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. అలా శ్రేయస్ ఆడుతున్నప్పుడు చాహల్ తో పాటు తన భార్యను కూడా చూపిస్తే తప్పులేదు కానీ కేవలం ఆమెను మాత్రమే హైలెట్ చేస్తూ జూమ్ చేసి మరి చూపించడం అనేక రకాల అనుమానాలను రేకెత్తిస్తోంది. ఈ విషయంపై వారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Previous article2000 గురించి చెప్పమంటే.. 2047 అంటారు.. ఆయన్ని నమ్మగలమా..?
Next articleఅక్టోబర్ సర్వే ప్రకారం టాప్ 10 హీరోయిన్లు వీరే…పొజిషన్లు అన్ని మారిపోయాయిగా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.