ఎందుకు సెలెబ్రిటీలు బ్లాక్ వాటర్ ని తాగుతారు..?

Ads

0సెలబ్రిటీలు ఎక్కువ డబ్బులని సంపాదిస్తూ ఉంటారు పైగా ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పెడితే ఉంటారు. ఫిట్నెస్ స్కిన్ హెల్త్ ఇలా.. చాలామంది సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ ని తాగడం మీరు చూసే ఉంటారు. కరణ్ జోహార్, మలైకా అరోరా ఇలా చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ ని ఎయిర్ పోర్ట్ కి లేదంటే జిమ్ కి తీసుకువెళ్లిన ఫోటోలని మీరు చూసే ఉంటారు.

ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా..? ఎందుకు సెలబ్రిటీలు బ్లాక్ వాటర్ ని తీసుకుంటారు మామూలు నీళ్లలా ఎందుకు బ్లాక్ వాటర్ ని తీసుకుంటారు..? వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మరి ఎందుకు స్పెషల్ గా తీసుకుంటారు అని… ఈ సందేహం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి. అప్పుడు మీకు వాళ్ళు ఎందుకు బ్లాక్ వాటర్ ని తాగుతారు అనే విషయం అర్థం అవుతుంది.

అయితే నిజానికి నార్మల్ వాటర్ లాగే బ్లాక్ వాటర్ కూడా ఉంటాయి మామూలు మంచినీళ్లు ఏ రుచిని అయితే కలిగి ఉంటాయో అవి కూడా అదే రుచిని కలిగి ఉంటాయి. కానీ వాటి వల్ల ఉపయోగం ఏంటంటే.. చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు బ్లాక్ వాటర్ ఉపయోగపడతాయి. ముఖ్యంగా యాక్ని వంటి ఇబ్బందుల నుండి దూరం చేస్తుంది బ్లాక్ వాటర్.

Ads

అదేవిధంగా బ్లాక్ వాటర్ వల్ల అజీర్తి సమస్యలు ఉండవు. అజీర్తి సమస్య నుండి బయటపడవచ్చు. డయాబెటిస్ వంటి ఇబ్బందులతో బాధపడే వాళ్ళు కూడా బ్లాక్ వాటర్ ని తాగుతూ ఉంటారు. బ్లాక్ వాటర్ చాలా ఏళ్ల నుండి ఉంది. బ్లాక్ వాటర్ అనేది ఆల్కలైన్ వాటర్. మామూలు వాటర్ కంటే కూడా దానిలో పీహెచ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ వాటర్ ని తీసుకోవడం వలన గట్ హెల్త్ బాగుంటుంది.

అలానే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ని యాడ్ చేయడం జరుగుతుంది. ఒంట్లో ఉంటే చెడు మలినాలని బయటకి పంపించడానికి ఇది సహాయపడుతుంది. స్మోక్ చేసే వాళ్ళకి ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకునే వాళ్ళకి కూడా ఈ బ్లాక్ వాటర్ బాగా హెల్ప్ అవుతుంది. ఈ మధ్యకాలంలో జిమ్స్ లో ఎక్కువగా చెబుతున్నారు బ్లాక్ వాటర్ వల్ల ఉపయోగం ఉంటుంది తీసుకోమని అందుకని చాలామంది జిమ్ చేసే వాళ్ళు కూడా బ్లాక్ వాటర్ ని ప్రిఫర్ చేస్తున్నారు.

Previous articleరీ ఎంట్రీ కి సిద్ధపడుతున్న ఒకప్పటి సీనియర్ హీరోలు వీళ్లే… ఎవరో గుర్తుపట్టారా.?
Next articleకొత్త బంగారు లోకం సినిమాలో ఇంత పెద్ద తప్పా..? మీరు కనిపెట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.