Ads
హిందూ సంప్రదాయం ప్రకారం మనం కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటాము పెద్దలు చెప్పినట్లు ఫాలో అవుతూ ఉంటాము. మన పెద్దలు పురాతన కాలం నుండి వస్తున్న ఆచారాలను పాటిస్తూ వస్తున్నారు వాటిని మనం పాటించి మన పిల్లలకి కూడా వాటిని చెప్తూ వెళ్లాలి అప్పుడే మంచిది చెడు మధ్య తేడా తెలుస్తుంది. మన పెద్దలు అనుసరిస్తున్న పద్ధతులు గుడ్డిగా అనుసరిస్తున్నవి కావు వాటి వెనక ఎంతో అర్థం ఉంటుంది. మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా ఏ పనులు చేసినా సరే మన సాంప్రదాయం ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటాము.
ఒక శిశువు జన్మించిన తర్వాత ఓ సాంప్రదాయం ఉంటుంది దానికి తగ్గట్టుగా మనం పాటించాలి అలానే చనిపోయిన తర్వాత కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. చనిపోయిన తర్వాత కూడా మనం కొన్ని పద్ధతుల్ని అనుసరించాలి చాలామందిలో ఉండే సందేహం ఏంటంటే చనిపోయిన వ్యక్తి వస్తువులని బట్టలని మనం ఉపయోగించవచ్చా.. లేదంటే వాటిని ఉపయోగించకూడదా..? ఉపయోగించడం తప్ప..? అసలు ఏం చేయాలి..?
Ads
చనిపోయిన వ్యక్తి బట్టలని చనిపోయిన వ్యక్తి వస్తువులను మనం ఏం చెయ్యచ్చు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని వస్తువులని ఉపయోగిస్తూ ఉంటారు ఉదాహరణకి బట్టలు, దువ్వెన, పౌడరు, చెప్పులు ఇలాంటివి అయితే చనిపోయిన వ్యక్తి తాలూకా వస్తువులను మనం ఉపయోగించకూడదు. ఎందుకంటే దోషాలు వీటిలోకి వెళ్తాయి. అవి మనకి పెట్టుకోవచ్చు. లేదంటే శరీరంలో ఉండే రోగాలు కూడా ఆ వస్తువునికి సంభవించొచ్చు. వైరస్ వంటివి స్ప్రెడ్ అవ్వచ్చు. అలానే నెగటివ్ ఫీలింగ్స్ కూడా వస్తువుల ద్వారా మనలో కలుగుతాయి.
ఇలా ఇవన్నీ కూడా వ్యక్తి తాలూకా వస్తువులకి వ్యాపించవచ్చు అందుకనే చనిపోయిన వారి వస్తువులను వాడకూడదు. ముఖ్యంగా చెప్పులు, దువ్వెన వంటివి అసలు ఉపయోగించకూడదు. ఒకరు వాడిన చెప్పులు షూ సాక్సులు వంటివి ఇంకొకరు అస్సలు ఉపయోగించరాదు. ఇతరులు దుస్తులను కూడా మరొకరు ధరించకూడదు. ఒకవేళ వేసుకుంటే నెగిటివ్ ఫీలింగ్స్ కలుగుతుంటాయి. అలానే చనిపోయిన వాళ్ళ వస్తువులు కూడా మరొకరు ఉపయోగించకూడదు. అందుకనే చాలా మంది బట్టల్ని కాల్చేస్తూ ఉంటారు. పుణ్యఫలితం కానీ కర్మ ఫలితం కానీ ఆ మనిషితో పాటు వెళ్లిపోవాలి.