Ads
సినిమా రంగంలో చాలా భాషల ఇండస్ట్రీలు ఉంటాయి. ఒక భాష ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇంకొక భాష ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు. అయితే ప్రతి భాషకి సమానమైన గౌరవం ఇవ్వడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇటీవల జరిగిన ఒక విషయం మీద ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. భారతదేశ సినిమా ఇండస్ట్రీ గర్వపడే దర్శకుల్లో శంకర్ ఒకరు. అలాంటి శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఇది శంకర్ చేస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా. దాంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం వాయిదా పడుతూ వస్తోంది.
ఇప్పుడు అవ్వాల్సిన షెడ్యూల్ కూడా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ పాటలు ఇటీవల ట్రోలింగ్ కి గురవుతున్నాయి. అందుకు కారణం పాటల్లో కొత్తదనం లేకపోవడం. ఒకటే రకమైన పాటలు ఇస్తున్నారు అంటే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు శంకర్ సినిమాకి కూడా ఏమైనా మారిందా అంటే అది కూడా లేదు. ఈ సినిమా నుండి జరగండి పాట విడుదల అయ్యింది. ఈ పాట పాత తమన్ పాటల లాగానే ఉంది. కొత్తగా ఏమీ అనిపించలేదు.
Ads
అది కూడా ముఖ్యంగా మన తెలుగు వాళ్లకి అయితే అస్సలు కొత్తగా అనిపించలేదు. ఎన్ని రోజులు ఇదే రొటీన్ మ్యూజిక్ అనే ఫీలింగ్ వచ్చింది. ఈ పాటకి మిగిలిన ఏ భాషలో కూడా ఆదరణ లభించలేదు. ఒక శంకర్ సినిమా పాట ఇలా ఉండదు. ఇప్పుడు శంకర్ ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నారు. ఇది తమిళ్ సినిమా. ఈ సినిమా నుండి ఒక పాట నిన్న విడుదల అయ్యింది. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుండి వచ్చిన పాట విన్న వెంటనే చాలా బాగుంది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవల దేవర సినిమా పాట కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి కూడా అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. దేవర మొదటి పాట వింటే లియో పాట గుర్తొచ్చింది అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇదే అనిరుధ్ ఇండియన్ 2 సినిమాకి మాత్రం అంత మంచి పాట ఇచ్చారు. దాంతో ఇప్పుడు శంకర్ మీద, అనిరుధ్ రవిచందర్ కామెంట్స్ వస్తున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే అంత చులకన అయిపోయినప్పుడు ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
“అనిరుధ్ అంటే దర్శకుడు అడిగినట్టు పాట ఇచ్చారు. కానీ శంకర్ ఒకవేళ తనకి పాట నచ్చకపోతే చెప్పే అవకాశం ఉంది కదా? అసలు జరగండి లాంటి పాటని శంకర్ ఎలా అంగీకరించారు? ఆయన సినిమాల్లో ఉండాల్సిన పాట అది కాదు కదా? ఈ విషయం ఎందుకు చెప్పలేదు?” అంటూ శంకర్ మీద కామెంట్స్ వస్తున్నాయి.