Ads
ప్రసుతం ఐపీఎల్ ఫీవర్ నడుస్తుంది. ఆర్సీబీ టీం కి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్సీబీ దినేష్ కార్తీక్ ని 5.50Cr కి కొనుగోలు చేసింది. ఆర్సీబీ కి దినేష్ ఇప్పుడు అత్యంత విలువైన ఆటగాడు. అనేక కీలక మ్యాచ్ ల్లో జట్టును విజయ తీరాలకు చేర్చాడు కార్తీక్. ఇది ఇలా ఉంటె..మీరెప్పుడైనా గమనించారా.. దినేష్ వాడే హెల్మెట్ ఇతర బ్యాటర్స్ కి డిఫరెంట్ గా ఉండడాన్ని?
దీనికి ప్రత్యేక కారణమంటూ ఏం లేదు కానీ హెల్మెట్ యొక్క బరువు (తేలికగా ఉండడం) కారణం అవ్వొచ్చు. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ రూల్స్ కి కట్టుబడి ఉన్నంత వరకూ పరికరాల ఎంపిక ఆటగాడి వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన విషయం.
Ads
డీకే ఈ రకమైన హెల్మెట్ వాడడం ఇదే తొలిసారి కాదు. అతని వికెట్ కీపింగ్ హెల్మెట్ కూడా ఇతర కీపర్లకు భిన్నంగా ఉన్న సందర్భాలు అనేకం. అంతర్జాతీయ క్రికెట్ (ICC), IPL రెండింటిలోను అనేక సందర్భాల్లో కార్తీక్ బేస్ బాల్-రకం ఫేస్ ప్రొటెక్టర్ గార్డ్ ధరించి కనిపించాడు. ఇది క్రికెట్ నిబంధనల ద్వారా అనుమతించబడుతుంది. కేవలం దినేష్ కార్తీక్ మాత్రమే కాదు. రాహుల్ త్రిపాఠి కూడా ఇదే రకమైన బ్యాటింగ్ హెల్మెట్‌ని ధరిస్తాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర, ఇంగ్లండ్ మాజీ బ్యాటర్లు జేమ్స్ టేలర్ మరియు మైఖేల్ కార్బెర్రీ కూడా అప్పట్లో ఇటువంటి హెల్మెట్‌లను ధరించేవారు.