ఐదుగురు పాండవులతో ద్రౌపది ఎలా కాపురం చేసేదో తెలుసా..? వాళ్ళు పెట్టుకున్న నియమం ఏంటంటే.?

Ads

పతివ్రతలలో ద్రౌపది ఒకరు. మహాభారతంలో పంచపాండవులను వివాహం చేసుకున్న ద్రౌపదికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా ఆమె పాత్ర వివాదస్పదమైనది. ఎందుకంటే ఒక స్త్రీకి ఒక్కరే భర్తగా ఉండటం ధర్మం.

కానీ మహాభారత కాలంలో ఆమె ఎలా ఐదుగురిని పెళ్లి చేసుకుంది. ఎలా వారితో కాపురం చేసింది. ఆమె విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందనే విషయాలు చాలామందికి తెలియవు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
ద్రౌపది స్వయంవరంలో మత్స్య యంత్రాన్ని చేధించిన అర్జునుడిని ద్రౌపది వరిస్తుంది. ఆ తరువాత ఆమెను అర్జునుడు తల్లి కుంతి దగ్గరికి తీసుకెళ్ళి అమ్మా నేను ఏమి తెచ్చానో చూడు అంటాడు. పనుల్లో నిమగ్నమైన కుంతి తెచ్చినదానిని ఐదుగురు పంచుకోమని అర్జునుడికి చెబుతుంది. ఆతరువాత అసలు విషయం తెలుసకున్న ఆమె బాధపడుతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన వ్యాసుడు కుంతి ని నోటి నుండి ఆ మాటను పలికించింది శివుడే. ఐదుగురు భర్తలు అవడం అనేది ద్రౌపది వీధి అని చెప్తాడు.
ద్రౌపది గత జన్మలో అవివాహితురాలు. ఆమెకు వివాహం జరుగకపోవడంతో శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కఠోర చేస్తుంది. అయితే చాలా ఏళ్ల తరువాత శివుడు ఆమెకు ప్రత్యక్షం అవుతాడు. వారం కోరుకోమని అడుగగా, ఆమె ఐదు రకాల గుణాలు కలిగిన వ్యక్తి భర్తగా ఇవ్వమని అడుగుతుంది. ఆమె చెప్పిన లక్షణాలు ఒక్కరిలో ఉండడం అసాధ్యం అని చెబుతాడు.అందుకు ద్రౌపది దేవునికి అసాధ్యం అనేది ఉండదని చెబుతుంది.
అప్పుడు శివుడు ఈ 5 లక్షణాలు కల ఐదుగురు వ్యక్తులు నీకు వచ్చే జన్మలో భర్తలు అవుతారని అనుగ్రహిస్తాడు. అలాగే ప్రతి ఉదయం స్నానం చేసినపుడు, నీ కన్యత్వం అనేది తిరిగి పొందుతావని శివుడు అనుగ్రహిస్తాడు. అందువల్లే దృపద మహారాజుకు జన్మించి, ఇలా ఈ ఐదుగురికి భార్యగా కాబోతుంది అని వ్యాసుడు వివరిస్తాడు. అలా తల్లి చెప్పిన దాని ప్రకారం ద్రౌపదిని పాండవులు ఐదుగురు వివాహం చేసుకుంటారు.
పాండవుల ఐదుగురికి ద్రౌపది విషయంలో గొడవ రాకుండా ఉండేందుకు నియమం పెట్టుకున్నారు. ఒక్కొక్కరు సంవత్సరం చొప్పున ద్రౌపది వద్ద ఉండేవారు. అలా ఆమె వద్ద ఒకరు ఉన్నప్పుడు మిగిలిన నలుగురు ఆమె వద్దకు వెళ్లకూడదు, ఆమెను చూడకూడదు అని నియమం పెట్టుకుంటారు. అలా ఒక సంవత్సరం పూర్తయితే వారు నాలుగేళ్ల వరకు వేచి ఉండేవారు. ఈ విధంగా పాండవులతో కాపురం చేసి, ఐదుగురి బిడ్డలకు తల్లి అవుతుంది. వీరిని ఉపపాండవులు అని పిలుస్తారు.

Ads

Also Read: అయోధ్య రాముడిని దర్శించుకోవాలనుకుంటున్నారా..? ఇదిగో సులభ మార్గాల వివరాలు!

Previous articleమెగాస్టార్ పక్కన ఉన్న స్టార్ హీరో.. 500 రూపాయల నుండి 15 కోట్ల రెమ్యూనరేషన్ కు ఎదిగిన హీరో.! గుర్తు పట్టారా..?
Next articleAYODHYA: అయోధ్యలో తెల్ల రాయితో చేసిన రాముడు విగ్రహం ఎక్కడ ఉంది. ..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.