“బుమ్రా” 43 వ ఓవర్ లో.. న్యూజిలాండ్ బాట్స్మన్ క్రీజ్ లోకి రాకున్నా, అంపైర్ “రన్ అవుట్” ఎందుకు ఇవ్వలేదు..?

Ads

ప్రపంచ కప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్ వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య బుధవారం నాడు జరిగింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్ థ్రిల్లింగ్ గా సాగి ఫ్యాన్స్ ను అలరించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ పై విజయం సాధించి, టీమిండియా ఫైనల్ లో అడుగుపెట్టింది.

భారత్ 70 పరుగుల తేడాతో కివీస్ ను ఓడించింది. అయితే 43వ ఓవర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఫ్యాన్స్ ను  కన్ఫ్యూజన్‌ కి గురి చేసింది. అది జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో ఆసక్తికరమైన ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. కివీస్ జట్టు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు,  43వ ఓవర్‌ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చేశారు. బుమ్రా తన అద్భుతమైన త్రో తో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గ్లెన్ ఫిలిప్స్‌ క్రీజులోకి రాకముందే వికెట్లను పడేశాడు.

Ads

బుమ్రా వేసిన బంతి నేరుగా వెళ్ళి వికెట్లను తాకింది. అయితే అప్పటికి గ్లెన్ ఫిలిప్స్ క్రీజులోకి ఇంకా చేరుకోలేదు. అయితే దానిని అంపైర్ ఔట్ గా  ప్రకటించలేదు. దీంతో అభిమానులు కన్ఫ్యూజన్‌ అయ్యారు. బుమ్రా వేసిన త్రోను అవుట్ గా ప్రకటించకపోవడానికి వెనుక కారణం ఉందని తెలుస్తోంది. ఎంసీసీ నియమాల ప్రకారం, వికెట్ల పైన ఉన్న 2 బెయిల్స్ కిందపడి ఉన్నప్పుడు ఫీల్డర్ రనౌట్ చేయాలనుకుంటే బాల్ ని చేత్తో పట్టుకుని, వికెట్లను కూడా లాగేయాల్సి ఉంటుందట.
బుధవారం జరిగిన భారత్, న్యూజిలాండ్ మ్యాచ్‌లో బుమ్రా రనౌట్ చేసినా, అప్పటికే వికెట్ పైన ఉండే బెయిల్స్ రెండు కిందపడిపోయాయి. జడేజా విసిరిన బంతికి బెయిల్స్ కిందపడ్డాయి. అందువల్ల బుమ్రా మళ్ళీ వికెట్లను పడగొట్టినా అంపైర్ ఫిలిప్స్‌ను రనౌట్ ప్రకటించకుండా, నాటౌట్‌గా ప్రకటించారు. బుమ్రా ఒకవేళ బంతిని పట్టుకుని, వికెట్‌ను తీసేసి ఉంటే అంపైర్ ఫిలిప్స్‌ రనౌట్ అయినట్టు ప్రకటించేవారట.

Also Read: ఇదెక్కడి ట్విస్ట్..? ఇండియా గెలిచింది కోహ్లీ, శ్రేయాస్, షమీ వల్ల కాదా..? మరి ఎవరి వల్ల..?

Previous articleఇదెక్కడి ట్విస్ట్..? ఇండియా గెలిచింది కోహ్లీ, శ్రేయాస్, షమీ వల్ల కాదా..? మరి ఎవరి వల్ల..?
Next articleశుభమన్ గిల్ ని రిటైర్డ్ హర్ట్ అవ్వమని.. అశ్విన్ తో రోహిత్ పంపిన మెసేజ్ వెనక ఇంత ప్లాన్ ఉందా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.