హనుమాన్ జయంతిని ప్రతి ఏడాది రెండు సార్లు ఎందుకు జరుపుకుంటారు.? 2024 లో ఆ రెండు తేదీలు ఎప్పుడంటే.?

Ads

హనుమంతుడిని హిందువులు ఎంతో పవిత్రమైన దేవుడిగా ఆరాధిస్తారు.ప్రతి మంగళ, శనివారాలలో అంజనీ పుత్రునికి ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే హనుమాన్ జయంతిని హిందువులు పెద్ద పండుగగా జరుపుకుంటారు. అయితే ఒక సంవత్సరంలో హనుమాన్ జయంతి ని రెండు సార్లు జరుపుకుంటారు. ఇలా రెండు సార్లు జరుపుకోవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ పురాణాల ప్రకారం సీతను రావణుడు అపహరించినప్పుడు సీతాదేవి ఆచూకీ కోసం హనుమంతుడు వెతుకుతున్న నేపద్యంలో హనుమంతుడు మంగళవారం తెల్లవారుజామున లంకలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు.

Ads

ఆ రోజున చైత్రమాసం చిత్త నక్షత్రం పౌర్ణమి . ఆరోజున హనుమంతుడు అశోక నగరాన్ని నాశనం చేయడమే కాకుండా రావణ సైనికులను హతమారుస్తాడు. అలాగే తన తోకతో సగం లంకను దహనం చేస్తాడు. ఆరోజున హనుమంతుని విజయంగా జరుపుకోవాల్సిన రోజని తెలియని వారు ఆ రోజున హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్ లో వస్తుంది.

నిజానికి హనుమంతుడి జయంతి వైశాఖ మాసం శుక్ల దశమి రోజున అసలైన జయంతి వేడుకలు నిర్వహించాలి.ఆరోజు సాధారణంగా ప్రతి సంవత్సరం మే నెల చివరి లో వస్తుంది పూర్వభద్ర పాద నక్షత్రం లో చంద్రుడితో పాటు జన్మించాడు. పరాశరసహిత ప్రకారం ఆ రోజే అసలైన హనుమంతుడి జయంతి. ఇది హనుమంతుడి పై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం. ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం ఒకసారి మాత్రమే అదీ మే చివరి వారంలో హనుమంతుడి జయంతి ఉత్సవాలు జరుపుకోవాలి.

Previous articleసూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించారా..? ఏ సినిమాలో అంటే..?
Next articleమెస్మరైజ్ విజువల్స్ తో మార్వెల్ స్టూడియోస్ ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’ ట్రైలర్ విడుదల !!!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.